స్టేజ్ పైనే చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్
బుల్లితెర యాంకర్ గా మంచి పేరు దక్కించుకున్న అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 12:00 PM ISTబుల్లితెర యాంకర్ గా మంచి పేరు దక్కించుకున్న అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ, ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి పలు రియాలిటీ షో లకు జడ్జిగా, సినిమాల్లో కీలక పాత్రలు చేసే స్థాయికి ఎదిగారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా ఖాళీ టైమ్ లో వెకేషన్స్ కు, మాల్స్, షాప్ ఓపెనింగ్స్ కు కూడా వెళ్తూ ఉంటారామె.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అనసూయ ఎప్పుడూ ఏదొక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. కొన్నిసార్లు తన ఫోటోలతో వార్తల్లోకెక్కితే, మరికొన్ని సార్లు తాను చేసే వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అనసూయ మాట్లాడే మాటలు చాలా స్ట్రాంగ్ గా, సూటిగా ఉంటాయని అందరూ అంటుంటారు.
అనసూయపై అసభ్యకరంగా కామెంట్స్
కాగా తాజాగా అనసూయ స్టేజ్ పై ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా అనసూయ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లారు. అక్కడ స్టేజ్ మీద ఫ్యాన్స్ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న అనసూయను కొందరు అసభ్యకరంగా కామెంట్స్ చేయడంతో అనసూయ వారిపై ఫైర్ అయ్యారు.
ఇంట్లో ఏం నేర్పించలేదా అంటూ ఫైర్
స్టేజ్ పైనే చెప్పు తెగుద్ది, వెరీ బ్యాడ్. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య ఉండరా? వారిని కూడా ఇలానే ఏడిపిస్తే ఊరుకుంటారా? పెద్ద వారిని ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వాళ్లు నేర్పించలేదా? మీ కోసం ఇలా రెడీ అయి వస్తే మీరు ఇలా చేస్తారా అంటూ అనసూయ తీవ్రంగా విరుచుకుపడగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ విషయంలో అందరూ అనసూయకు మద్దతిస్తున్నారు.
