Begin typing your search above and press return to search.

త‌న‌ను తిట్టేవాళ్ల‌పై అన‌సూయ బ్ర‌హ్మాస్త్రం

నేను ఒక స్త్రీని.. భార్య‌ను.. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని. అయినా నేను నా వ్య‌క్తిగ‌త అభిరుచికి త‌గ్గ దుస్తుల‌నే ధ‌రిస్తాను.

By:  Sivaji Kontham   |   30 July 2025 11:09 PM IST
త‌న‌ను తిట్టేవాళ్ల‌పై అన‌సూయ బ్ర‌హ్మాస్త్రం
X

అవును.. ట్రోల‌ర్స్ పైకి యాంక‌ర్ అన‌సూయ `బ్ర‌హ్మాస్త్రం` విసిరారు. విమ‌ర్శ‌కుల‌పై ఇది ఎదురే లేని అస్త్రం. `కోపం లేకుండా స్ప‌ష్టంగా` అంటూ సూటిగా గుండెల్లోకి దూసుకెళ్లే ఒక‌ నోట్ రాసారు. ధైర్యంగా ఉంటే అది అగౌర‌వమా..? అభిరుచికి త‌గ్గ దుస్తులు ధ‌రించ‌డం త‌ప్పు అవుతుందా? అని సూటిగా సుత్తి లేకుండా ప్ర‌శ్నించారు. త‌న గురించి త‌న క‌ట్టు, బొట్టు, దుస్తుల గురించి విమ‌ర్శించే వారిపై ఎలాంటి దూష‌ణ‌ల‌కు దిగకుండా నింపాదిగా, ప‌ద్ధ‌తిగా చెప్పాల్సిన‌ది చెప్పారు అన‌సూయ‌.


తాజాగా ఇన్ స్టా మాధ్య‌మంగా అన‌సూయ రాసిన నోట్ బ్లాస్ట్ అయింది. త‌న దుస్తుల ఎంపిక విషయంలో, గ్లామ‌ర్ ఎలివేష‌న్ విష‌యంలో ప్ర‌జ‌లను తీర్పు చెప్పవద్దని కోరుతూ, తనను లక్ష్యంగా చేసుకునే బదులు తేడాలను ఎలా అంగీకరించాలో నేర్చుకోవాలని అన‌సూయ సూచించారు. ``ఇటీవ‌ల మౌనంగా ఉంటున్నాను. కానీ దీనికి భిన్నంగా స్ప‌ష్టంగా, కోపం లేకుండా మాట్లాడాల్సి వ‌స్తోంది`` అని అన్నారు. సోషల్ మీడియా ఛానెల్‌లలో తిరుగుతున్న కొంద‌రు మహిళా స్పీకర్లు తనను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నార‌ని అన్నారు. వారెవ‌రో నాకు తెలీక‌పోయినా నా వ్యక్తిగత విష‌యాల‌ను స్వేచ్ఛ‌గా మాట్లాడుతున్నారు.

నేను ఒక స్త్రీని.. భార్య‌ను.. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని. అయినా నేను నా వ్య‌క్తిగ‌త అభిరుచికి త‌గ్గ దుస్తుల‌నే ధ‌రిస్తాను. గ్లామ‌ర్ - స్టైల్ -ఆత్మ‌విశ్వాసం ఎల్ల‌పుడూ నా ఐడెంటిటీని ప్ర‌తిబింబిస్తాయి. ఇది త‌ల్లిగా ఉండ‌టానికి స‌రిప‌డ‌ద‌ని కొంద‌రు న‌మ్ముతారు. అయినా ఇది నా ప్ర‌శ్న‌... తల్లి కావడం అంటే మ‌న‌ నిజమైన స్వభావాన్ని వదులుకోవడమా?

నా కుటుంబం - నా భర్త- పిల్లలు.. నేను ఎలా ఉన్నా ప్రేమిస్తారు. వారు నాపై తీర్పు చెప్పరు.. నాకు మద్దతు ఇస్తారు. ఇది చాలా ముఖ్యం. కొందరు ఈ స్థాయిలో బ‌హిరంగంగా ఉండ‌టానికి అలవాటు పడకపోవచ్చు.. అయినా ఎవ‌రి ఎంపిక‌ను కూడా త‌ప్పు ప‌ట్ట‌వ‌ద్దు అని సూచించారు. తన కుమారులు తనను నమ్మకంగా, దయగా, గౌరవంగా, సిగ్గు ప‌డాల్సిన అవ‌స‌రం లేని మహిళగా చూస్తున్నారని అనసూయ పేర్కొన్నారు.

``ధైర్యంగా ఉండటం అంటే అగౌరవంగా ఉండటంతో సమానం కాదు... నేను ఆనందించే రీతిలో దుస్తులు ధరించడం అంటే నేను నా విలువలను కోల్పోయానని కాదు`` అని తన స్వ‌భావాన్ని వివ‌రించారు అన‌సూయ‌. తన జీవితాన్ని ఎవరూ అనుసరించకూడదని, జీవ‌న విధానంపై ఎవరూ తీర్పు చెప్పకూడదని పేర్కొన్నారు. ఎటాక్ చేయ‌కుండా జీవ‌న వైరుధ్యాల‌ను అంగీక‌రించ‌డం నేర్చుకుంటే, మ‌రింత శాంతియుతంగా స‌హ‌జీవ‌నం చేయ‌గ‌లం.. నేను ఎల్లప్పుడూ ఇతరులపై గౌరవాన్ని కొనసాగిస్తూ గర్వంగా, ప్రేమగా జీవిస్తూనే ఉంటాను.. అని అన్నారు.

ఇటీవ‌ల ఓ యూట్యూబ్ జ‌ర్న‌లిస్ట్ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన అన‌సూయ దుస్తుల గురించి షోలో వ్యాఖ్యానించారు. టీవీ షోల‌లో అలాంటి దుస్తులు ధ‌రించ‌డం త‌గునా? అంటూ విలువ‌లను ప్ర‌శ్నించారు. కొడుకుల ముందే ట్రోలింగ్ కు గురయ్యేలా దుస్తులు ధ‌రిస్తున్నార‌ని కూడా విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత అన‌సూయ నుంచి స్ట్రాంగ్ రియాక్ష‌న్ ఇలా లేఖ రూపంలో వెలువ‌డింది. అన‌సూయ త‌దుప‌రి `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో క‌నిపించ‌నుంది. `ర‌జాకార్` అనే చిత్రంలోను న‌టిస్తోంది.