40ల్లో కూడా 20లా.. పట్టుచీరలో కట్టిపడేస్తున్న అనసూయ!
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతోనే కాదు సాంప్రదాయంగా కూడా కనిపించి అలరించే అనసూయ తాజాగా మరోసారి అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది.
By: Madhu Reddy | 12 Dec 2025 11:00 PM ISTబుల్లితెర ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్ గా పేరు సొంతం చేసుకున్న అనసూయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో.. తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. న్యూస్ రీడర్ గా తన కెరీర్ ను ఆరంభించిన ఈమె.. చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో లా స్టూడెంట్ గా సునీల్ వెనకాల ఒక చిన్న పాత్రలో కనిపించింది. అయితే ఇవేవీ కూడా ఆమెకు గుర్తింపును అందించలేదు. కానీ ఎప్పుడైతే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ లోకి యాంకర్ గా అడుగుపెట్టిందో ఒక్కసారిగా భారీ పాపులారిటీ అందుకుంది.
దాదాపు 9 సంవత్సరాల పాటు తన యాంకరింగ్ తో షోకి ఊహించని టిఆర్పి రేటింగ్ ని కూడా అందించింది అనడంలో సందేహం లేదు. అంతేకాదు బుల్లితెరకు యాంకరింగ్ లో గ్లామర్ అనే సరికొత్త హంగులను తీర్చిదిద్దింది కూడా అనసూయ అని చెప్పవచ్చు. అలా అందరి దృష్టిని ఆకట్టుకొని అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసిన ఈమె ఒక్క యాంకరింగ్ లోనే కాదు నటనలో కూడా సత్తా చాటింది. సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో నటిగా భారీ పాపులారిటీ అందుకున్న అనసూయ.. ఆ తర్వాత పుష్ప సినిమాలో దాక్షాయని పాత్ర పోషించి విలన్ గా అదరగొట్టేసింది. అంతేకాదు రజాకార్ వంటి చిత్రాలతో నటనలో విశ్వరూపం చూపించిన ఈమె.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అబ్బురపరిచింది.
అలా నటన రంగంలో కూడా సత్తా చాటిన అనసూయ ప్రస్తుతం పలు డాన్స్ షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతోనే కాదు సాంప్రదాయంగా కూడా కనిపించి అలరించే అనసూయ తాజాగా మరోసారి అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది. రెడ్ కలర్ పట్టుచీరలో కనిపించి సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ఇంస్టాగ్రామ్ వేదికగా అనసూయ షేర్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ పట్టుచీర కట్టుకున్న ఈమె.. దీనికి కాంబినేషన్లో గోల్డెన్ కలర్ బ్లౌజ్ ధరించింది. చంద్రాకారపు చెవి దిద్దులు ధరించి, అందమైన హెయిర్ స్టైల్ తో తన మేకోవర్ను ఫుల్ ఫిల్ చేసింది.
40 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాలు అమ్మాయిలా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది అనసూయ. ఇక ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అనసూయ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. అయితే కూతురు లేదనే బాధ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. మొత్తానికి అయితే అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
