Begin typing your search above and press return to search.

అనసూయని చూసి కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ.. దెబ్బకు గొడవలకు క్లారిటీ!

బుల్లితెరపై గత పుష్కర కాలంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్.

By:  Madhu Reddy   |   6 Aug 2025 6:00 PM IST
అనసూయని చూసి కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ.. దెబ్బకు గొడవలకు క్లారిటీ!
X

బుల్లితెరపై గత పుష్కర కాలంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఈ ఏడాదికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఇప్పటికే ఈ ఈవెంట్ కి సంబంధించిన రెండు ఎపిసోడ్లను టెలికాస్ట్ చేయగా.. అవి బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో ప్రోమోని పంచుకున్నారు. ఈ ప్రోమోలో స్టేజ్ పై అనసూయను చూడగానే రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను హగ్ చేసుకుని తన బాధను వ్యక్తం చేసింది. అంతేకాదు గతంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చారు ఈ లేడీ యాంకర్లు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్ షోలో 9 సంవత్సరాల పాటు యాంకర్ గా చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది అనసూయ. అయితే అనూహ్యంగా ఈ షోకి బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటోంది . అయితే సినిమాలు చేస్తోంది కానీ బుల్లితెరపై తన ఇష్టాన్ని చంపుకోలేదు. అలా ఈ మధ్య ఒక షోలో జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కానీ జబర్దస్త్ షోలో మళ్లీ కనిపించలేదు.. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జబర్దస్త్ షోలో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇకపోతే అనసూయ ఇప్పుడు జబర్దస్త్ షోలో పాల్గొనడమే కాకుండా.. తోటి యాంకర్ రష్మితో తనకున్న విభేదాలపై తొలిసారి స్పందించింది. స్టేజ్ పైకి రాగానే అనసూయ మాట్లాడుతూ.. జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదు అంటారు.. అయితే నేను మాత్రం తప్పకుండా ఇస్తుంది అంటాను. నేను కొన్ని ప్యాచెస్ చేయడానికి బ్యాలెన్స్ ఉన్నాయి. అంటూ స్టేజ్ మీదకు వచ్చి రష్మిని హగ్ చేసుకుంది. దీంతో వెంటనే రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ తర్వాత అనసూయ మాట్లాడుతూ..ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు ఈ ప్యాచ్అప్ వల్ల తెలిసిపోయేలా ఉన్నాయి.. అయ్యో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదా అని అనసూయ చెబుతుండగానే.. మధ్యలో రష్మీ కలుగజేసుకొని ఇదేదో వాట్సప్ లేదా ఫోన్ చేసి మాట్లాడుంటే అయిపోయేది కదా అని అనింది..అలా అయితే చాలా ఈగోలు అడ్డొస్తాయి.. ఇలా అయితే బెటర్ అంటూ అనసూయ స్టేజ్ పైనే నవ్వేసింది.. మొత్తానికి అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. ఈ ప్రోమోతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలకు... పులిస్టాప్ పడిందని చెప్పవచ్చు.

రష్మీ విషయానికి వస్తే.. ఇప్పటికీ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లలో యాంకర్ గా చేస్తోంది. ఈమె కూడా మొదట్లో హీరోయిన్ గా ప్రయత్నం చేసినా.. అవకాశాలు తలుపుతట్టక పోయేసరికి జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. ఇక్కడే పలు షోలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.