నన్ను విమర్శించడమే వారి లక్ష్యం - అనసూయ
ఇకపోతే తాను చాలా స్ట్రాంగ్ అని, అయితే ప్రస్తుతం తాను అనారోగ్యంతో ఉండడంతోనే ఆ బలహీన క్షణంలో కన్నీళ్లు ఆగలేదు .
By: Madhu Reddy | 15 Jan 2026 10:08 AM ISTజబర్దస్త్ ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది అనసూయ. తన అద్భుతమైన వాక్చాతుర్యంతోనే కాకుండా గ్లామర్ తో కూడా అందరిని కట్టిపడేస్తూ బుల్లితెర క్వీన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి ఈమె జబర్దస్త్ లో దాదాపు 9 సంవత్సరాలు పాటు నిర్విరామంగా యాంకర్ గా పనిచేసి ఆ తర్వాత సినిమాలలోకి ప్రవేశించింది. అక్కడే పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రంగస్థలం, రజాకార్ , పుష్ప వంటి చిత్రాలు ఈమెకు మంచి విజయాన్ని అందించాయి.
ఇకపోతే సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే అనసూయ.. అప్పుడప్పుడు తనకు అవసరం లేని విషయాలలో కూడా తలదూర్చి వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే మొన్నామద్య శివాజీ గొడవలో తల దూర్చి విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. తాజాగా ఎమోషనల్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తనను విమర్శించడమే వారి లక్ష్యం అంటూ కామెంట్లు చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల జరిగిన జూమ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఈమె తనకు లభించిన మద్దతు.. తనను భావోద్వేగానికి గురిచేసింది అని చెప్పుకొచ్చింది.
ఇకపోతే తాను చాలా స్ట్రాంగ్ అని, అయితే ప్రస్తుతం తాను అనారోగ్యంతో ఉండడంతోనే ఆ బలహీన క్షణంలో కన్నీళ్లు ఆగలేదు .తాను పూర్తిగా బాగున్నాను. స్వయం నిర్ణయాధికారానికి మద్దతుగా మాట్లాడినందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. అయితే తన వెనుక నిలబడ్డ అద్భుతమైన, బలమైన మహిళల వల్ల తనకు అపారమైన ధైర్యం లభించింది అని చెప్పుకొచ్చింది అనసూయ. ఇక అదే జూమ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.." నేను కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనాలని అనుకున్నాను. అయితే అక్కడ జరిగే చర్చ పక్కదారి పడుతుందని భావించి ఇలా జూమ్ కాల్ లోకి రావాల్సి వచ్చింది.
ముఖ్యంగా నా మాటలను కొంతమంది అదేపనిగా వక్రీకరించారు. నా వ్యక్తిగత విషయాలనే లక్ష్యంగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. నేను పద్ధతిగా చీర కట్టుకొని వచ్చిన రోజు కూడా నీ నుదుటన సింధూరం ఏది అని ట్రోల్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా జీవితంలో ఇంతలా విమర్శలు నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను కూడా మనిషినే కదా.. మీరు చేసిన డ్యామేజ్ ని తిరిగి పూడ్చలేరు. నేను దేనినైనా మాట్లాడకూడదని రెండేళ్లుగా మౌనంగా ఉన్నా.. ముఖ్యంగా నేనేం మాట్లాడినా సరే విమర్శలు చేస్తూ నన్ను టార్గెట్గా చేసి హైలెట్ చేస్తున్నారు అంటూ ఆమె ఎమోషనల్ అయింది. మొత్తానికైతే అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈమెను టార్గెట్గా చేసుకొని.. కామెంట్లు చేస్తున్న వాళ్ళు ఎవరు అని అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు.
