Begin typing your search above and press return to search.

'అదే నిజమైన హీరోయిన్'.. అనసూయ కొత్త పోస్ట్ ఎవరికోసం?

రీసెంట్ గా నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించి హాట్ టాపిక్ గా మారారు. అనేక మంది అనసూయకు మద్దతు తెలిపారు.

By:  M Prashanth   |   6 Jan 2026 4:15 PM IST
అదే నిజమైన హీరోయిన్.. అనసూయ కొత్త పోస్ట్ ఎవరికోసం?
X

యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. అదే సమయంలో పలు విషయాలపై కూడా రెస్పాండ్ అవుతుంటారు. రీసెంట్ గా నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించి హాట్ టాపిక్ గా మారారు. అనేక మంది అనసూయకు మద్దతు తెలిపారు.

కొందరు మాత్రం.. ఓ షో లో ఆమె చేసిన డబుల్ మీనింగ్ తో వచ్చిన డైలాగ్స్ ను గుర్తుచేసి ఫైర్ అయ్యారు. అప్పుడే సీనియర్ నటి రాశిపై చేసిన కామెంట్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో పలువురు అనసూయపై మండిపడ్డారు. రాశి కూడా తన యూట్యూబ్ ఛానల్ లో రెస్పాండ్ అవ్వడంతో అనసూయ స్పందించి నిన్న సారీ చెప్పారు.

ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో మరో స్టోరీ పెట్టారు. ఎవరి పేరు కూడా ప్రస్తావించకుండా హీరోయిన్ అంటూ స్టార్ట్ చేశారు. "హీరోయిన్ తెరపై కాదు.. సత్యం మాట్లాడే ధైర్యం.. సొంత దారిలో నడిచే శక్తి.. సరైనదానికి నిలబడే గుండె.. అదే నిజమైన హీరోయిన్.. మిగతా వాళ్లు కేవలం నటులే" అంటూ అనసూయ ఇన్ స్టా స్టోరీలో రాసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎవరి పేరును కూడా ఆమె మెన్షన్ చేయకపోవడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరిని ఉద్దేశించి పెట్టారో అంటూ మాట్లాడుకుంటున్నారు. నిన్న రాశికి సారీ చెప్పిన అనసూయ.. సడెన్ గా ఇలా పోస్ట్ పెట్టడంతో ఎవరికోసం అబ్బా అంటూ చర్చించుకుంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో ఆమెకే తెలియాలని అంటున్నారు.

ఇక నిన్న రాశి గారి ఫలాలు కామెంట్స్ పై అనసూయ క్షమాపణలు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌ లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని అన్నారు. ఆ వ్యాఖ్యలు రాయించి, డైరెక్ట్ చేసిన వ్యక్తిని ఆ రోజునే నిలదీయాల్సి ఉందని చెప్పారు. కానీ ఆ టైమ్‌ కి తన శక్తి సరిపోలేదని తెలిపారు.

తానిప్పుడు వెనక్కి వెళ్లి దాన్ని సరిదిద్దలేనని, కానీ మనుషులు మారతారని చెప్పారు. అలాంటి మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు తనలో వచ్చిన మార్పు మీరు గమనించవచ్చని చెప్పారు. మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న తనకు వ్యతిరేకంగా, అప్పటి ఆ మాటలు తీసి నెగటివ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా, తన బాధ్యతగా తప్పుని అంగీకరిస్తూ క్షమాపణ చెప్తున్నానని తెలిపారు. మహిళల శరీరాలపై వస్తున్న కథనాలను బలంగా తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. రఅంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. మరి లేటెస్ట్ స్టోరీ ఎవరికోసం పెట్టారో తెలియాల్సి ఉంది.