కంట్రోలింగ్ వేరు, కేరింగ్ వేరు.. శివాజీ కామెంట్స్ పై అనసూయ కౌంటర్
దీనిపై ఇప్పటికే సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించగా, ఇప్పుడు ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు.
By: M Prashanth | 23 Dec 2025 5:40 PM ISTదండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, సంప్రదాయం అంటే ఏంటి అనే దానిపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై ఇప్పటికే సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించగా, ఇప్పుడు ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు.
ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె పెట్టిన ఒక ఇంగ్లీష్ నోట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. డైరెక్ట్ గా శివాజీ పేరు ఎత్తకుండా ఆమె తన వివరణ ఇచ్చారు. పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద మహిళలు ఎలా డ్రెస్ చేసుకోవాలి అనే దానిపై రీసెంట్ గా వచ్చిన కామెంట్స్ ను ఉద్దేశించి అనసూయ ఈ పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె చాలా క్లియర్ గా, లాజికల్ గా తన పాయింట్స్ ను చెప్పారు. "కొంతమంది కంట్రోల్ చేయడాన్ని బాధ్యత గా, జడ్జ్ చేయడాన్ని రక్షణగా పొరబడుతుంటారని, ఇది గమనించాల్సిన విషయం" అని ఆమె స్ట్రాంగ్ గా చెప్పారు.
అసలు డ్రెస్సింగ్ గురించి అనసూయ ఏమన్నారంటే.. "ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆమె వేసుకునే బట్టలు ఎవరినీ ఉద్దేశించి వేసుకునేవి కావు, దానివల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగదు" అని ఆమె స్పష్టం చేశారు. బట్టల్లో తప్పు లేదని, చూసేవాళ్లలోనే సమస్య ఉందని ఆమె ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు.
అసలు సమస్య ఎక్కడుందంటే.. "ఎదుటివారి బట్టల గురించి చేసే కామెంట్స్, చూసే చూపులు, అడగకుండా ఇచ్చే ఉచిత సలహాలు.. ఇవే ఎదుటివారిపై ప్రభావం చూపిస్తాయి తప్ప బట్టలు కాదు" అని అనసూయ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఫ్యాక్ట్ ఏంటంటే.. సమస్య బట్టల్లో లేదు, జడ్జ్ చేసే మైండ్ సెట్ లోనే ఉందనేది ఆమె వాదన.
ఇక మోరల్ పోలీసింగ్ గురించి మాట్లాడుతూ.. "మనలోని అభద్రతా భావాన్ని ఇలా మోరల్ పోలీసింగ్ గా మార్చడం వల్ల అది మగతనం అనిపించుకోదు, రక్షణ కల్పించడం అసలే కాదు. అది కేవలం ఎదుటివారిని కంట్రోల్ చేయడమే అవుతుంది. గౌరవం అనేది ఒకరు పర్యవేక్షిస్తే వచ్చేది కాదు" అని అనసూయ కుండబద్దలు కొట్టారు. ఫైనల్ గా ఆమె ఒక పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ తో తన పోస్ట్ ను ఎండ్ చేశారు. "ఇతరులను కంట్రోల్ చేయడం అనేది బలం ముసుగులో ఉన్న బలహీనత మాత్రమే.. ఎదుటివారిని గౌరవించడమే నిజమైన బలం" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు.
