Begin typing your search above and press return to search.

'కట్టు-బొట్టు' వ్యాఖ్యలతో అనసూయ టార్గెట్.. నెట్‌లో విమర్శల వెల్లువ!

టాలీవుడ్ లో ఇటు బుల్లితెర, అటు వెండితెరపై తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు.

By:  Madhu Reddy   |   23 Aug 2026 5:18 PM IST
కట్టు-బొట్టు వ్యాఖ్యలతో అనసూయ టార్గెట్.. నెట్‌లో విమర్శల వెల్లువ!
X

టాలీవుడ్ లో ఇటు బుల్లితెర, అటు వెండితెరపై తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మహిళల సంప్రదాయ అలంకరణలు, ఆచారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భర్త మరణం తర్వాత మహిళల బొట్టు, గాజులు తీసేయడంపై ఆమె లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీంతో నెటిజన్ల నుంచి ఆమె మరోసారి తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు.

అమ్మను చూసి బాధేసింది.. అనసూయ ఆవేదన:

ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. తన తండ్రి మరణించిన తర్వాత తల్లి తన అలంకరణలన్నింటికీ దూరం కావడం తనను ఎంతో కలచివేసిందని చెప్పారు. ఆడపిల్లలకు పుట్టుకతోనే గాజులు, కాటుక, గోరింటాకు వంటివి అలవాటు చేస్తారని, అలాంటి సంప్రదాయాలను భర్త మరణంతో ముడిపెట్టి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ఒకవేళ ఆ అలంకారాలు తీసేయాల్సి వస్తే అమ్మ లేదా అమ్మమ్మ మరణించినప్పుడు తీసేయాలి కానీ, భర్త చనిపోతే ఎందుకు తీసేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరు సపోర్ట్ కొందరు విమర్స:

అనసూయ ఆవేదనగా మాట్లాడినప్పటికీ, ఆ వీడియోలో ఆమె స్వయంగా నుదుటిపై బొట్టు లేకుండా కనిపించడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. "మీ హస్బేండ్ వున్నారు కదా మరి మీరెందుకు బొట్టు పెట్టుకోలేదు?" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆచారాల గురించి వేదాంతాలు చెప్పే ముందు నువ్వు పాటించు అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక కొందరు సనాతన దర్మం అంటే అంతే అంటూ ..కొందరు మీరు చెప్పింది నిజమే అంటూ సపోర్ట్ చేస్తున్నారు..

'జై శ్రీరామ్' వివాదం.. నటి హేమ హెచ్చరిక:

ఇటీవలే ‘జై శ్రీరామ్’ నినాదంపై అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని కించపరిచారంటూ ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ విషయంలో సీనియర్ నటి హేమ కూడా స్పందిస్తూ.. "అద్దాల మేడలో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. పవిత్రమైన దివ్య మంత్రాన్ని నిందించకూడదు" అని ఘాటుగా హితవు పలికారు.

'జై శ్రీరామ్' వివాదం ఇంకా పూర్తిగా సమసిపోకముందే, తాజాగా కట్టు-బొట్టు మరియు ఆచారాలపై అనసూయ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వేడిని రాజేశాయి. ఇక ప్రశ్నించడం మంచిదే అయినా, సంప్రదాయాలు మరియు ఇతరుల భావోద్వేగాల పట్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు ఆమెకు సూచిస్తున్నారు. మరి ఈ కొత్త వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి..