Begin typing your search above and press return to search.

ట్రెడిషనల్ లుక్‌లో అనసూయా అందాల ఆభరణం

ఆ ఫోటోలలో కనిపించిన నేచురల్ స్మైల్, పోజ్, అట్టిట్యూడ్ అన్నీ కలిపి ఒక స్టైలిష్ వైబ్‌ను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి.

By:  M Prashanth   |   13 Oct 2025 11:30 PM IST
ట్రెడిషనల్ లుక్‌లో అనసూయా అందాల ఆభరణం
X

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా తనదైన ముద్ర వేసుకుంటున్న అనసూయా భరద్వాజ్ ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లుక్స్‌తో ఆకట్టుకుంటూనే ఉంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన సిల్క్ చెక్స్ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నాయి. నేవీ బ్లూ బ్లౌజ్, రెడ్ అండ్ యెల్లో చెక్స్ కలయికతో కూడిన శారీతో క్లాసీ లుక్‌లో మెరిసిన అనసూయ, ట్రెడిషనల్ జ్యూవెలరీతో మొత్తం లుక్‌ని హైలెట్ చేశారు.

ఆమె హేర్ స్టైల్, జువెలరీ, మేకప్ కలిసి ఆమె లుక్‌కి ప్రత్యేకమైన గ్లామర్ ను తీసుకొచ్చాయి. మూడ్ అన్ స్థాపబుల్ అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. ఆ ఫోటోలలో కనిపించిన నేచురల్ స్మైల్, పోజ్, అట్టిట్యూడ్ అన్నీ కలిపి ఒక స్టైలిష్ వైబ్‌ను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి.

కెరీర్ పరంగా చూస్తే, అనసూయ తన జర్నీని టెలివిజన్ యాంకర్‌గా ప్రారంభించింది. “జబర్దస్త్”, “డీ” వంటి షోలతో బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందింది. తరువాత ఆమె సినిమా రంగంలో అడుగుపెట్టి రంగస్థలం, పుష్ప: ది రైజ్ వంటి సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషించి వెర్సటైల్ యాక్ట్రెస్‌గా నిరూపించుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ, సినిమాలు, ఈవెంట్స్‌ ఎక్కడైనా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

పాజిటివ్ రోల్స్‌తో పాటు గ్రే షేడ్స్‌లోనూ తన నటనతో దృష్టిని ఆకర్షించింది. తన ప్రతి పాత్రను డిఫరెంట్‌గా మలచుకునే అనసూయ, స్క్రీన్‌పై కూడా, స్క్రీన్ వెలుపల కూడా స్రాంగ్ ప్రెజెన్స్‌ను కొనసాగిస్తోంది. మొత్తం మీద ఈ ట్రెడిషనల్ సారీ లుక్‌లో అనసూయ చూపించిన కాన్ఫిడెన్స్, గ్రేస్ సోషల్ మీడియాలో మరలా చర్చనీయాంశమైంది. ఏ లుక్ అయినా తనదైన స్టైల్లో హైలెట్ చేస్తారు అని ఎక్కువమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు.