Begin typing your search above and press return to search.

సాంప్రదాయ లుక్స్‌లో అనసూయ అందాల మాయ

టాలీవుడ్‌లో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన ఫ్యాషన్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.

By:  M Prashanth   |   7 Sept 2025 4:18 PM IST
సాంప్రదాయ లుక్స్‌లో అనసూయ అందాల మాయ
X

టాలీవుడ్‌లో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన ఫ్యాషన్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అందుకు నిదర్శనం. సంప్రదాయ కంచిపట్టు సారీ, వైలెట్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోషూట్‌లో ఆమె ధరించిన ఆభరణాలు, మేకప్ మరింత అందంగా హైలెట్ అయ్యింది.

అనసూయ ఎప్పటిలాగే తన లుక్స్‌కి కొత్తదనం తీసుకువచ్చేలా ఈసారి కూడా ఫ్యాషన్‌కు సాంప్రదాయాన్ని కలిపి తనదైన స్టైల్‌లో ప్రదర్శించింది. ఆరెంజ్ కలర్ సిల్క్ సారీకి వైలెట్ బ్లౌజ్ జతచేయడం ద్వారా క్లాసీ టచ్ వచ్చింది. బంగారు జుమ్కీలు, వెండి గాజులు, రింగ్‌లు ఆమె లుక్‌కి ప్రత్యేకమైన ఆకర్షణగా మారాయి.

సినిమా కెరీర్ విషయానికి వస్తే, అనసూయ యాంకర్‌గా ‘జబర్దస్త్’ షోతో బుల్లితెరపై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి విభిన్న పాత్రలతో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. క్షణం, రంగస్థలం, పుష్ప: ది రైజ్ వంటి చిత్రాల్లో ఆమె నటన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో ఆమెకు మంచి పేరు వచ్చింది.

ఇక ఇటీవల ఆమె చేసిన కొన్ని సినిమాల్లోనూ యాక్టింగ్ వైవిధ్యాన్ని చూపిస్తూ, గ్లామర్ పాత్రలు కాకుండా ప్రాధాన్యం ఉన్న రోల్స్ ఎంచుకుంటోంది. అదే సమయంలో టెలివిజన్ రంగంలోనూ తన ప్రెజెన్స్ కొనసాగిస్తూ, యాంకరింగ్‌లో తన ఎనర్జీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.