Begin typing your search above and press return to search.

కొత్త ఏడాది.. మరో బోల్డ్ స్టెప్.. భయపడేదేలేదు..

న్యూస్ రీడర్ గా కెరీర్ ను ఆరంభించి.. యాంకర్ గా జబర్దస్త్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ.

By:  Madhu Reddy   |   1 Jan 2026 3:27 PM IST
కొత్త ఏడాది.. మరో బోల్డ్ స్టెప్.. భయపడేదేలేదు..
X

న్యూస్ రీడర్ గా కెరీర్ ను ఆరంభించి.. యాంకర్ గా జబర్దస్త్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ముఖ్యంగా బుల్లితెరకు గ్లామర్ ను పరిచయం చేస్తూ.. కామెడీ కార్యక్రమాలలో కూడా గ్లామర్ ఒలకబోసి తన అందాలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా తన వాక్చాతుర్యంతో టిఆర్పి రేటింగ్ అమాంతం పెంచేసి.. దాదాపు 9 ఏళ్ల పాటు నిర్విరామంగా జబర్దస్త్ లో కొనసాగి అందరి మన్ననలు పొందింది. అలా జబర్దస్త్ లో యాంకర్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సినిమాలలో నటిగా అవకాశం అందుకొని.. మరింత క్రేజ్ దక్కించుకుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా.. పుష్ప సినిమాలో దాక్షాయినిగా తన పాత్రలతో మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రజాకార్ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించి నటిగా తానేంటో నిరూపించుకుంది అనసూయ.




అటు సినిమాలతోనే కాదు ఇటు సమాజంలో జరిగే పలు అంశాలపై కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా స్పందించే ఈమె.. ఇటు బోల్డ్ గా ఫోటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అంతేకాదు ఎవరు ఏమనుకున్నా తన లైఫ్ తన ఇష్టం అంటూ స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతూ అడ్డొచ్చిన వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇక అలాంటి ఈమె న్యూ ఇయర్ 2026 సందర్భంగా ఇంస్టాగ్రామ్ వేదికగా స్విమ్ సూట్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసి మరోసారి రచ్చకు తెరలేపింది.




అసలే గత కొన్ని రోజులుగా మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్లకు అనసూయ తనదైన శైలిలో స్పందించింది. అటు శివాజీ కూడా ఈమె వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నేను మిమ్మల్ని ఇందులోకి లాగలేదు. కానీ మీరు అడ్డొచ్చారు.. తప్పకుండా మీరు రుణం తీర్చుకుంటాను అంటూ శివాజీ కామెంట్లు చేశారు.. అయితే ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా తాను మాత్రం తగ్గేదేలే అని.. ఎవరికి భయపడను అంటూ మరొకసారి అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది అనసూయ.




దీనికి తోడు అదిరిపోయే క్యాప్షన్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ.. "అనసూయ.. అదే మహిళ.. అదే స్పైన్.. గ్రోత్.. ప్రశాంతత.. ఎటువంటి నాన్సెన్స్ లేకుండా ఈ సంవత్సరం కొనసాగాలని కోరుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాను. నాకు ఇష్టమైనవి చేస్తాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా తింటాను. లిమిట్స్ లేకుండా ప్రయాణిస్తాను. భయమన్నదే లేకుండా మాట్లాడుతాను. గొప్పగా జీవిస్తాను. ఎక్కువగా ప్రేమిస్తాను. ఈ న్యూ ఇయర్లో మరింత ప్రకాశవంతంగా వెలుగుతూ నాయిస్ కంటే కూడా మీ ధైర్యం ఎక్కువగా ఉండాలని.. అందరికీ హ్యాపీ 2026" అంటూ ఈ ఫోటోలను పోస్ట్ చేసింది అనసూయ..

మొత్తానికైతే తన గురించి ఎవరు ఎన్ని రకాలుగా చర్చించినా తన జీవితం తన ఇష్టం అంటూ మరోసారి ఈ ఫోటోలతో కొత్త ఏడాది కొత్త నిర్ణయాలతో ఎవరికీ భయపడను అంటూ బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది అనసూయ. ప్రస్తుతం కొత్త సంవత్సరం సందర్భంగా ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.