Begin typing your search above and press return to search.

అన‌సూయ పేరు చెప్పి బ‌తికేస్తున్నారా..?

`దండోరా` ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయిన విష‌యం తెలిసిందే. హీరోయిన్‌ల వ‌స్త్ర ధార‌ణ‌పై శివాజీ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపాయి.

By:  Tupaki Entertainment Desk   |   8 Jan 2026 9:00 PM IST
అన‌సూయ పేరు చెప్పి బ‌తికేస్తున్నారా..?
X

`దండోరా` ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయిన విష‌యం తెలిసిందే. హీరోయిన్‌ల వ‌స్త్ర ధార‌ణ‌పై శివాజీ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపాయి. దీనిపై గాయ‌ని చిన్మ‌యి, అన‌సూయ‌, నాగ‌బాబు ఘాటుగా స్పందించారు. శివాజీపై ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదాన్ని బాగా వాడేసుకుంది మాత్రం అన‌సూయ అని చెప్ప‌క త‌ప్ప‌ది. మిగ‌తా వారికి మించి అన‌సూయ ఈ వివాదంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌రుస పోస్ట్‌లు పెడుతూ నెట్టింట వైర‌ల్ అవుతూ వ‌స్తోంది.

శివాజీ ఈ వివాదంపై స్పందించి క్ష‌మాప‌ణ‌లు చెప్పినా అన‌సూయ మాత్రం దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ త‌న‌కు కావాల్సిన మైలేజీని గేయిన్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదికగా అన‌సూయ అభిమానుల‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. ఇందులోనూ శివాజీ టాపిక్‌ని తీసి మ‌ళ్లీ వాడేసుకుంది. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పింది. ఈ సంద‌ర్భంగా అన‌సూయ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. అంతే కాకుండా త‌న త‌రుపున న్యూస్ ఛాన‌ల్స్‌లో జ‌రిగే డిబేట్‌ల‌లో పాల్గొంటున్న వ్య‌క్తులు ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని` ఫ్యాన్స్ అసోసియేష‌న్` అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

పురుషుల‌ని ఎందుకు విల‌న్స్‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని అడిగితే నేను ఫెమినిస్ట్‌నే కానీ పురుషుల వ్య‌తిరేకిని కాదు అంది. త‌న‌పై వ‌స్తున్న ట్రోలింగ్స్‌ గురించి మాట్లాడుతూ నేను అన్న‌ది ఒక‌టి అక్క‌డ జ‌రుగుతున్న చ‌ర్చ మ‌రొక‌టి అని తెలిపింది. నేను గౌర‌వంగానే ఉన్నాన‌ని చెబుతూనే వారి ఖ‌ర్మ‌కు వారిని వ‌దిలేద్దాం అని చెప్పుకొచ్చింది. ఇక శివాజీ గురించి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ఆస‌క్తిక‌రంగా స్పందించింది. శివాజీ గారు ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న మాట‌లు అంద‌రూ వినే స్థాయికి ఎదిగారు. సినిమా వ‌ర‌కే ఆ పాత్ర‌ల ప్ర‌భావం ఉంటుంది. సినిమాలోని పాత్ర‌ల‌ను నిజ జీవితంలోకి తీసుకురావ‌ద్దు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త గురించి మంచి ఉద్దేశంతో చెప్పిన‌ప్పుడు `అబ్బాయిలూ మీరు కూడా అమ్మాయిల‌ను వారికి న‌చ్చిన‌ట్టు ఉండ‌నివ్వండి.. వీలైతే తోడుగా ఉంటామ‌ని హామీ ఇవ్వండి` అని చెప్పొచ్చుక‌దా` అంది.

వివాదాల‌కు మీ విలువైన స‌మ‌యాన్ని కేటాయించ‌డం క‌రెక్టేనా? అని అడిగితే దిమ్మ‌దిరిగే స‌మాధానం చెప్పి ఒకింత షాక్ ఇచ్చినంత ప‌ని చేసింది. కొంద‌రు న‌న్ను ఇలాంటి వ్య‌వ‌హారాల్లోకి లాగిన‌ప్పుడు న‌న్ను నేను ఇలాగే ప్ర‌శ్నించుకుంటా. కానీ ఇది డెస్టినీ. నేను కార‌ణ‌జ‌న్మురాలిని అనుకుంటా. నేను ఏదైనా పాజిటివ్‌గా తీసుకుంటా. నా అభిప్రాయం త‌ప్ప‌కుండా చెబుతా. డీల్ చేయాల్సిన వాళ్లు ఉంటే చేస్తా. లేక‌పోతే వాళ్లే పోతారు` అంటూ షాకిచ్చింది. ఇందులో తాను కార‌ణ‌జ‌న్మురాలిని అని చెప్ప‌డంతో నెట్టింట జోకులు పేలుతున్నాయి.

ఇక ఫ్యాన్స్ అసోసియేష‌న్ గురించి మాట్లాడుతూ `న‌న్ను ఫాలో అయ్యేవాళ్లంద‌రికీ చెబుతున్నా. ఫ్యాన్స్ అనే ప‌దం న‌న్ను ఇబ్బందిపెడుతోంది. మీరంతా నా కుటుంబ‌మే. అన‌సూయ పేరుతో పేజీలు, సంఘాలు ఉన్నా న‌న్ను క‌లిసి న‌ప్పుడు చ‌క్క‌గా మాట్లాడుతూ.వాళ్లు నా ఫోటోల‌న్నీ క‌లిపి ఆల్బ‌మ్ చేసిన‌ప్పుడు వాటిని మీతో పంచుకుంటా. ఇప్పుడు వ‌చ్చిన ఆయ‌న (టీవీ డిబేట్‌ల‌లో పాల్గొంటున్న వ్య‌క్తిని ఉద్దేశిస్తూ) ఎలా వ‌చ్చారో నాకు తెలియ‌దు. ఆయ‌న మాట‌ల‌ను కూడా స‌మ్మ‌తించ‌ను. నా పేరు వాడుకుని వాళ్లు బ‌తుకుతున్నారు. వాళ్లంతా న‌న్ను ఎప్పుడూ వ్య‌క్తిగతంగా క‌ల‌వ‌లేదు` అని చెప్పుకొచ్చింది.