Begin typing your search above and press return to search.

“నా మాటలను వక్రీకరించారు!” అనసూయ ఫైర్… క్లారిటీ వైరల్!

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ 'జై శ్రీరామ్' నినాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.

By:  Madhu Reddy   |   14 Aug 2026 9:59 PM IST
“నా మాటలను వక్రీకరించారు!” అనసూయ ఫైర్… క్లారిటీ వైరల్!
X

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ 'జై శ్రీరామ్' నినాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్‌పై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో అనసూయ స్పందిస్తూ మరో వీడియో, పోస్ట్‌ను షేర్ చేశారు. తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ ఘాటుగా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..

అసలు వివాదం ఏమిటి?:

ఇటీవల అనసూయ మాట్లాడుతూ, 'జై శ్రీరామ్' నినాదం చేసే కొందరి వైఖరిని ప్రశ్నించారు. జై శ్రీరామ్ అనేవాళ్లలో కొందరు దొంగలు ఉన్నారని, ఆ నినాదం ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక నినాదాలు చేయడం కంటే వ్యక్తుల ప్రవర్తనే ముఖ్యమని, సనాతన ధర్మం పేరుతో అక్రమాలకు పాల్పడటం సరికాదని ఆమె అనడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.

హిందూ సంఘాల ఆగ్రహం.. అనసూయ కౌంటర్:

అనసూయ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, పలువురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. హిందువులను, వారి నమ్మకాలను దూషించడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందంటూ ఆమెపై మండిపడ్డారు. ఇక దీనిపై తిరిగి స్పందించిన అనసూయ, తాను చేసిన కామెంట్ల తర్వాత దొంగలంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారంటూ కామెంట్ చేయడం వివాదాన్ని మరింత రాజేసింది.

నేనొక హిందూ సనాతనిని: అనసూయ క్లారిటీ:

పరిస్థితి దారితప్పడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా పూర్తి వివరణ ఇచ్చారు. "నేను నిజమైన సనాతన హిందువిని, హనుమంతుడిపై నాకు అపార భక్తి ఉంది" నా పెద్ద కొడుకుకు కూడా హనుమంతుడి పేరే పెట్టుకున్నాను. నా మతం అంటే నాకు ఎంతో గౌరవం. సమాజంలో ఎక్కడైనా అన్యాయం లేదా తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నా స్వభావం కాకే మాట్లాడాను" అని స్పష్టం చేశారు.

ఎడిటెడ్ వీడియోలను నమ్మవద్దని విజ్ఞప్తి:

తాను ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో మాట్లాడానో ఆ అసలు విషయాన్ని పక్కన పెట్టి, కేవలం తనను విమర్శించడమే లక్ష్యంగా కొందరు హాఫ్ స్టేట్‌మెంట్స్, ఎడిటెడ్ క్లిప్స్‌ను వైరల్ చేస్తున్నారని అనసూయ వాపోయారు. తనపై నమ్మకం ఉన్న అభిమానులు, ప్రేక్షకులు ఇలాంటి తప్పుడు ప్రచారాల వలలో పడకూడదని, తన మాటల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

మొత్తానికి అనసూయ భరద్వాజ్ 'జై శ్రీరామ్' వివాదంపై ఇచ్చిన సుదీర్ఘ క్లారిటీతో సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. తాను సనాతన ధర్మానికి వ్యతిరేకిని కానని, కేవలం ధర్మం ముసుగులో తప్పులు చేసేవారిని మాత్రమే ప్రశ్నించానని ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఈ క్లారిటీతో అయినా వివాదం సర్దుమణుగుతుందో లేదో చూడాలి.