చీరకట్టులో అనసూయ రాజసం.. గ్లామర్ కవ్వింతలు!
ఈ ఫొటోషూట్లో హైలెట్ ఆమె హెయిర్ స్టైల్ అనే చెప్పాలి. ఉంగరాల జుట్టును గాలికి వదిలేసి, ఆ కురుల మాటున ఆమె ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్ళను కట్టిపడేస్తున్నాయి.
By: M Prashanth | 15 Dec 2025 4:44 PM ISTబుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి సక్సెస్ అయిన వారిలో అనసూయ భరద్వాజ్ టాప్ లిస్ట్ లో ఉంటారు. యాంకర్గా తన ప్రయాణం మొదలుపెట్టినా, ఇప్పుడు స్టార్ నటిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు షోలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో తన గ్లామర్తో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండటం ఈ బ్యూటీ స్పెషాలిటీ. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు.

లేటెస్ట్ గా అనసూయ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట సెగలు రేపుతున్నాయి. మెటాలిక్ బ్లూ, గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్న పట్టుచీరలో ఆమె రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. దీనికి మ్యాచింగ్గా స్లీవ్లెస్ డిజైనర్ బ్లౌజ్ ధరించి, ట్రెడిషనల్ చీరకట్టులోనూ గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆమె లుక్ చూస్తుంటే క్లాసీగా ఉంటూనే ఎంతో గ్లామర్ గా, స్టైలిష్గా అనిపిస్తోంది.

ఈ ఫొటోషూట్లో హైలెట్ ఆమె హెయిర్ స్టైల్ అనే చెప్పాలి. ఉంగరాల జుట్టును గాలికి వదిలేసి, ఆ కురుల మాటున ఆమె ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్ళను కట్టిపడేస్తున్నాయి. భారీ ఆభరణాల జోలికి వెళ్లకుండా, కేవలం పెద్ద డిజైనర్ చెవిపోగులు, చేతికి నల్లటి గాజులు ధరించి సింపుల్గా మెరిసిపోయారు. హిందీ పాట లిరిక్స్ను క్యాప్షన్గా పెడుతూ, తనలోని లవ్లీ యాంగిల్ను బయటపెట్టారు.

కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనలోనూ తనకు తానే సాటి అని అనసూయ ఎప్పుడో నిరూపించుకున్నారు. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా, 'పుష్ప'లో దాక్షాయణిగా ఆమె చేసిన పాత్రలు అంత సులభంగా మర్చిపోలేం. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా ఎంచుకుంటూ నటిగా తన పరిధిని రోజురోజుకూ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. అప్పుడప్పుడు వెస్ట్రన్ వేర్లో షాక్ ఇస్తూనే, ఇలాంటి చీరకట్టులో అచ్చమైన తెలుగుదనాన్ని చూపిస్తూ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తుంటారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వయసు పెరుగుతున్నా ఆమెలోని గ్లామర్, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
