పట్టుచీరలో అనసూయ లేటెస్ట్ లుక్..
దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ షోలో కొనసాగిన అనసూయ.. అనూహ్యంగా షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 27 Jun 2026 5:31 PM ISTప్రముఖ యాంకర్ అనసూయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . న్యూస్ ఛానల్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా వ్యవహరించి.. తన నటన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ ఒక్క షోలో గ్లామర్ కి కొత్త నిర్వచనం చూపించిన ఈ ముద్దుగుమ్మ.. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అటు ఆడియన్స్ ను ఇటు జడ్జెస్ ను మెప్పిస్తూ షో కి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ షోలో కొనసాగిన అనసూయ.. అనూహ్యంగా షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా జబర్దస్త్ షోలో యాంకర్ గా పనిచేస్తున్న సమయంలోనే పలు చిత్రాలలో నటించిన ఈమె.. తన కెరియర్లో ఎన్నో మరిచిపోలేని పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రంగస్థలంలో రంగమ్మత్త , పుష్ప సినిమాలో దాక్షాయని ఇలా పలు పాత్రలు పోషించి మెప్పించింది. అంతేకాదు రజాకార్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా గత ఏడాది డ్రెస్సింగ్ విషయంలో తన అభిప్రాయాలను చెప్పి గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అలాంటి ఈమె తాజాగా పట్టుచీరలో నిండుగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. బ్లూ కలర్ పట్టుచీర కట్టుకొని దీనికి కాంబినేషన్లో కట్ వర్క్ తో డిజైన్ చేసిన మల్టీకలర్ బ్లౌజ్ ధరించి తన అందాలను ఫుల్ ఫిల్ చేసుకుంది. ముఖ్యంగా జుట్టును ముడిపెట్టి.. మెడలో ముత్యాలతో, మల్టీకలర్ పూసలతో డిజైన్ చేసిన చౌకర్ ధరించి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. ఇక ఎప్పుడూ చిట్టి పొట్టి బట్టలతో సోషల్ మీడియాలో మంట రాజేసే ఈ ముద్దుగుమ్మ ఇలా ఒక్కసారిగా సంప్రదాయంగా కనిపించేసరికి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సాంప్రదాయంగా తెలుగు అమ్మాయిలా ఉంది అంటూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అనసూయ సినిమా కెరియర్ విషయానికొస్తే.. ఎన్టీఆర్ నాగ సినిమాలో లా స్టూడెంట్ గా కనిపించి, తన కెరీర్ ను మొదలు పెట్టిన ఈమె..2016లో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో చిన్న పాత్ర పోషించి అలరించింది. ఇక క్షణం అనే సినిమాలో ఏసిపి విజయ పాత్రతో మెప్పించిన అనసూయ.. విన్నర్, రంగస్థలం , మీకు మాత్రమే చెప్తా, కథనం ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఒకవైపు నటిగా మరొకవైపు స్పెషల్ సాంగ్ లను డాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. చివరిగా అరి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే సినిమాలలోనే కాదు టీవీ షోలతో కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే..
