మరోసారి అనసూయపై ట్రోల్స్.. ఏమైందంటే
యాంకరింగ్, యాక్టింగ్ లో బిజీగా ఉన్న అనసూయ ఎప్పుడూ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుంటూనే ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 28 July 2025 1:59 PM ISTబుల్లితెర యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత నటిగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ భరద్వాజ్. అనసూయ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సంచనాలు క్రియేట్ చేస్తున్న అనసూయపై సోషల్ మీడియాలో భారీగా నెగిటివిటీ వస్తూ ఉంటుంది. గతంలో ఆమె విజయ్ దేవరకొండపై చేసిన పోస్ట్ ఎంతటి వివాదమైందో తెలిసిందే.
బిజీ లైఫ్ లో అనసూయ
యాంకరింగ్, యాక్టింగ్ లో బిజీగా ఉన్న అనసూయ ఎప్పుడూ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుంటూనే ఉంటారు. జబర్దస్త్ షో తో బాగా ఫేమస్ అయిన అనసూయ బుల్లితెరకు గ్లామర్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత క్షణం, రంగస్థలం, పుష్ప, పుష్ప2 సినిమాల్లో నటించి నటిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రీసెంట్ గా కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ లాంటి షో ల తో బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చిన అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన విషయంలో వచ్చే నెగిటివిటీ, ట్రోలింగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
30 లక్షల మందిని బ్లాక్ చేశా
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తన పోస్టులకు ఎవరైనా అభ్యంతరకరంగా కామెంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తానని, ఇప్పటివరకు తాను సుమారు 30 లక్షల మందిని బ్లాక్ చేసి ఉంటానని చెప్పారు. రియాక్ట్ అయ్యి అయ్యి ఇక భరించలేకపోయానని, అందుకే ఇక నా ప్రపంచంలో నువ్వు లేవు, నా లైఫ్ లో ఇక నువ్వు లేవనుకుని బ్లాక్ చేశానంటూ అనసూయ చెప్పారు.
అలా ఎలా చేస్తావని ట్రోల్స్
అనసూయ చేసిన ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ నెటిజన్లు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లు కేవలం 20 లక్షలు మాత్రమే అయినప్పుడు తానెలా 30 లక్షల మందిని బ్లాక్ చేసిందంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరైతే నువ్వింకా ఆ స్టేజ్ కు రాలేదని కామెంట్స్ చేస్తున్నారు. చాలా మందిని బ్లాక్ చేశానని కాకుండా పర్టిక్యులర్ గా నెంబర్ చెప్పి మరోసారి ట్రోల్ అవాల్సిన పనేముందని అంటున్నారు.
వ్యక్తిగా అయినా గౌరవించండి
కాగా ఈ ట్రోల్స్ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి రెస్పాండ్ అవుతూ, ఇతరులపై కామెంట్ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఆమె వైపు నుంచి కూడా ఆలోచించాలని, ఆమె చెప్పిన నెంబర్ నిజం కాకపోయినా ఆమె ఎదుర్కొంటున్న నెగిటివిటీ మాత్రం నిజమేనని, కనీసం ఆమెకు మనం ఓ వ్యక్తిగా అయినా గౌరవమిస్తే బావుంటుందని, ప్రతీ దాన్నీ ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.
