Begin typing your search above and press return to search.

అనసూయ 'కిల్లర్' లుక్స్.. గ్లామర్ వైబ్స్ వేరే లెవెల్!

బుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా క్రేజ్ అందుకుని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్​పై స్టార్ హీరోయిన్​గా దుమ్మురేపుతోంది అనసూయ భరద్వాజ్.

By:  M Prashanth   |   18 Dec 2025 1:20 PM IST
అనసూయ కిల్లర్ లుక్స్.. గ్లామర్ వైబ్స్ వేరే లెవెల్!
X

బుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా క్రేజ్ అందుకుని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్​పై స్టార్ హీరోయిన్​గా దుమ్మురేపుతోంది అనసూయ భరద్వాజ్. యాంకర్​గా కెరీర్ స్టార్ట్ చేసినా, ఇప్పుడు నటిగా ఆమె రేంజే వేరు. గ్లామర్ రోల్స్ అయినా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ అయినా అనసూయ దిగనంత వరకే.. వన్స్ దిగితే 'తగ్గేదే లే' అన్నట్లుగా దూసుకుపోతోంది. సినిమాల్లో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు.




లేటెస్ట్ గా అనసూయ పోస్ట్ చేసిన పిక్స్ ఇన్​స్టాగ్రామ్​ను షేక్ చేస్తున్నాయి. అనార్కలీ డ్రెస్​లో అమ్మడు చాలా క్లాసీగా, అంతకు మించి బ్యూటిఫుల్​గా మెరిసిపోతోంది. ఆ బ్లాక్ డ్రెస్ నిండా ఉన్న రంగురంగుల ప్రింట్స్ ఆమె లుక్​ను నెక్స్ట్ లెవెల్​కు తీసుకెళ్లాయి. ఫుల్ హ్యాండ్స్, ఫ్లోర్ లెంగ్త్ ఉన్న ఈ అవుట్​ఫిట్​లో అనసూయను చూస్తుంటే అచ్చం బాపు బొమ్మలా, ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తోంది.




స్టైలింగ్ విషయంలో అనసూయ ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే. ఈసారి హెవీ మేకప్ జోలికి వెళ్లకుండా చాలా న్యాచురల్​గా, సింపుల్​గా రెడీ అయ్యింది. చెవులకు పెద్ద సైజు వెండి జుంకాలు, చేతి వేళ్లకు రింగులు పెట్టుకుని చాలా క్యూట్​గా కనిపిస్తోంది. హెయిర్ లూజ్ చేసి, ఆ క్యూట్ స్మైల్​తో ఇస్తున్న ఫోజులు చూసి కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. సింపుల్ హీల్స్, లైట్ లిప్​స్టిక్​తో తన స్టైల్​ను పర్ఫెక్ట్​గా బ్యాలెన్స్ చేసింది.




కెరీర్ గ్రాఫ్ చూస్తే.. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా, 'పుష్ప'లో దాక్షాయణిగా అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు గ్లామర్ డోస్ పెంచుతూనే, మరోవైపు సీరియస్ రోల్స్​లోనూ జీవించేస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్​తో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.




ఎప్పటికప్పుడు వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ అంటూ కొత్త కొత్త ఫోటోషూట్స్​తో ఫ్యాన్స్​కు విజువల్ ట్రీట్ ఇవ్వడం అనసూయకు బాగా అలవాటు. ఏజ్ పెరుగుతున్నా ఆమెలోని గ్లామర్, ఎనర్జీ మాత్రం అస్సలు తగ్గట్లేదు. బ్లాక్ డ్రెస్​లో ఆమె రాయల్ లుక్ చూసి నెటిజన్లు "క్రేజీ", "స్టన్నింగ్", "బ్యూటిఫుల్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.