అనన్య మేకప్ ఫెయిల్యూర్‌పై నెటిజనుల ట్రోలింగ్
సెలబ్రిటీలపై ట్రోలింగ్ కల్చర్ పీక్స్ లో ఉంది. ముఖ్యంగా నటవారసులు ఏం చేసినా వారిని వెంబడించేందుకు రెడ్డిటర్లు రెడీగా ఉన్నారు.
By: Sivaji Kontham | 19 Sept 2025 9:56 AM ISTసెలబ్రిటీలపై ట్రోలింగ్ కల్చర్ పీక్స్ లో ఉంది. ముఖ్యంగా నటవారసులు ఏం చేసినా వారిని వెంబడించేందుకు రెడ్డిటర్లు రెడీగా ఉన్నారు. వారు ఎక్కడ ఏ తప్పు చేసినా విడిచిపెట్టడం లేదు. ఆ తప్పును ఎత్తి చూపుతూ, విమర్శలకు దిగుతున్నారు. ఇప్పుడు అలాంటి విమర్శలతో చిక్కుల్లో పడింది అనన్య పాండే.
ఈ బ్యూటీ ఇటీవల ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ `బాడ్స్ ఆఫ్ బాలీవుడ్` ప్రీమియర్ లో కనిపించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా అనన్య టాన్ కి గురైన తీరు, మేకప్ సరిపోలకపోవడాన్ని చాలా మంది విమర్శించారు. తన ముఖం లేత గులాబీ రంగులో అందంగా మెరిసిపోతుంటే, ఆ మెడ, చేతులు నల్లని టాన్ తో మిస్ మ్యాచ్ అవ్వడాన్ని ఫ్యాషన్ ప్రేమికులు చెలరేగి విమర్శిస్తున్నారు. అనన్య మేకప్ సరిగా లేదని కొందరు విమర్శించగా, రెండిటినీ బ్యాలెన్స్ చేస్తే బావుండేదని కొందరు సూచించారు.
కొందరు `తనన్య` అని కామెడీగా పిలిచారు. మరికొందరు నెటిజనులు అనన్యను నిందించడం సరికాదని, ఎందుకంటే తను నేరుగా మాల్దీవులలో ఎంజాయ్ చేసి వచ్చిందని సమర్థించారు. కానీ ముఖం శరీరం సరిపోలాలి కదా! అని ఒక నెటిజన్ విమర్శించారు. ఇది పొరపాటు కాదు.. ముఖం శరీరం ఒకే వ్యక్తికి చెందినవి కావు అని ఒకరు అన్నారు. మరొకరు `వెకేషన్ టాన్ పర్వాలేదు... కానీ ముఖాన్ని ఎందుకు మేకప్‌తో కప్పేసింది? అని ప్రశ్నించారు. సమాన టోన్ ఉంటే చాలా బాగుండేదని సూచించారు. అయితే అనన్య ఎలా ఉన్నా ఇలా విమర్శించడం అన్యాయమని కొందరు ఎదురు దాడికి దిగారు. టాన్ చాలా బావుందని, అయితే ముఖంతో సరిపోయేలా శరీరాకృతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలని కొందరు సూచించారు. చాలా మంది విమర్శకుల మాట వినవద్దని కోరడం కొసమెరుపు.
మరోవైపు అనన్య ధరించిన దుస్తులు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయని ప్రశంసలు కురిసాయి. క్యూట్ బ్యూటీ షాంపైన్-హ్యూడ్ దుస్తుల్లో మ్యాక్సీ రైన్‌స్టోన్ అలంకరణలతో డిజైనర్ లుక్ లో కనిపించింది. సైడ్ స్లిట్ మరింత గ్లామర్ ని తెచ్చిందని ప్రశంసిస్తున్నారు. బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ స్క్రీనింగ్‌లో రణబీర్, విక్కీ కౌశల్, ఖుషీ కపూర్, షానయా కపూర్, అలియా భట్ తదితరులు ఉన్నారు.
