'హై' టీజర్.. కంప్లీట్ కొత్త కాన్సెప్ట్ లా ఉందే..
అనన్య శర్మ, ఎస్.కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయికృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) కీలక పాత్రల్లో రూపొందుతున్న ఆ సినిమాకు ఎస్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
By: M Prashanth | 9 Feb 2026 6:34 PM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం కంటెంట్ ఉంటే చాలు.. రేంజ్ తో సంబంధం లేకుండా సినిమాలు హిట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ చిత్రాలు దాన్ని ప్రూవ్ చేశాయి. దీంతో కొత్త ఆలోచనలు.. సరికొత్త కాన్సెప్టులతో రూపొందుతున్న మూవీలు.. వరుసగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కోవకే చెందుతుంది ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ 'హై'.
అనన్య శర్మ, ఎస్.కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయికృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) కీలక పాత్రల్లో రూపొందుతున్న ఆ సినిమాకు ఎస్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చాలా కాలంగా వర్క్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు హై మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం తన డెబ్యూ చిత్రం షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు.
అయితే ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శించిన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే జోష్ తో మేకర్స్ తాజాగా టీజర్ ను తీసుకొచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అయితే రావిపూడి.. టీజర్ ను విడుదల చేసి మూవీ టీమ్ ను అభినందించారు. ఇంటర్నేషనల్ లెవెల్స్ తో రూపొందించిన థ్రిల్లర్ గా సినిమా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు.
అదే సమయంలో టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. సరికొత్త కాన్సెప్ట్ తో మూవీ రూపొందుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. సినిమాలోని ప్రతి పాత్ర కూడా కథకు ముఖ్యమైన మలుపు తీసుకువస్తుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య శర్మ.. మూవీలో కంప్లీట్ యాక్షన్ రోల్ లో కనిపించనుంది.
టీజర్ లో ఆమె లుక్, యాక్షన్ సీన్స్.. ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్.. అన్నీ హై క్వాలిటీతో ఉన్నాయి. అంతే కాదు.. స్టోరీలో ట్విస్టులు ప్రేక్షకులను థియేటర్స్ లో సీటు ఎడ్జ్ పై కూర్చోబెట్టేలా ఉంటాయని టీజర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. కథ ముందుకు సాగే తీరు థ్రిల్లర్ ప్రేమికులకు మంచి అనుభూతిని అందించనుందని అర్థమవుతుంది.
ఇక సినిమాను హరీష్ పెద్ది, ఎస్.కృష్ణ, శేఖర్ దివ్వెలా కలిసి నిర్మిస్తున్నారు. మోడ్రన్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు తీస్తున్నట్లు టీజర్ చెప్పకనే చెబుతోంది. అయితే టీజర్ లో స్టోరీ లైన్ ఎక్కడ లీక్ కాకుండా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారని చెప్పాలి. త్వరలో సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్. మరి హై మూవీ ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
