డ్రీమీ లెహంగా లుక్‌లో స్టన్నింగ్‌గా కనిపించిన అనన్య పాండే
బాలీవుడ్ నటి గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే తన లేటెస్ట్ ఫ్యాషన్ షూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
By: Madhu Reddy | 18 July 2026 6:00 PM ISTబాలీవుడ్ నటి గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే తన లేటెస్ట్ ఫ్యాషన్ షూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా కౌతుర్ కలెక్షన్ నుండి డిజైన్ చేసిన ఒక అద్భుతమైన వైట్ లెహంగాలో ఆమె దేవకన్యలా మెరిసిపోయింది. సరికొత్త 'లైట్ సాంగ్ ‘26' థీమ్‌తో రూపొందిన ఈ బ్రైడల్ లెహంగాలో అనన్య ఇచ్చిన పోజులు, ఆ డ్రెస్ వెనుక ఉన్న అద్భుతమైన శ్రమ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ఒక హాట్ టాపిక్‌గా మారాయి. ఆ విశేషాలు చూద్దాం..
చంకీ పాండే కూతురిగా ఎంట్రీ.. స్టార్‌గా గుర్తింపు:
సీనియర్ నటుడు చంకీ పాండే కుమార్తెగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనన్య పాండే, చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2019లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ వో', 'గెహ్రాయియాన్', 'ఖో గయే హమ్ కహా', 'సిటిఆర్‌ఎల్' వంటి వైవిధ్యమైన చిత్రాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక గ్లామర్ మరియు టాలెంట్‌తో కుర్రకారును మైమరపిస్తూ బాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ స్టార్స్‌లో ఒకరిగా దూసుకుపోతోంది.
2600 హ్యాండ్-కట్ పెటల్స్ మ్యాజిక్:
తాజాగా అనన్య ధరించిన 'వైట్ కామెలియా బ్రైడల్ లెహంగా' ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. ఈ డ్రెస్‌ను మరింత అందంగా మార్చడానికి ఏకంగా 2,600 విడివిడిగా చేత్తో కట్ చేసిన త్రీ-డైమెన్షనల్ కామెలియా పూల రేకులను ఉపయోగించారు. ఇక ఈ పూల రేకులను ఒకదానిపై ఒకటి ఎంతో జాగ్రత్తగా అమర్చి, లెహంగాకు ఒక అద్భుతమైన లుక్‌ను తీసుకొచ్చారు. డిజైనింగ్ రంగంలో ఇదొక అరుదైన కళాఖండంగా నిలిచిపోతుంది.
12 వేల ముత్యాలు.. 490 గంటల కష్టం:
కేవలం పూల రేకులే కాకుండా, ఈ లెహంగాపై 12,000 ముత్యాలు మరియు 680కి పైగా విలువైన స్ఫటికాలను ఉపయోగించి చేత్తో ఎంబ్రాయిడరీ చేశారు. ఇక ఉదయాన్నే వికసించిన పువ్వుపై పడే మంచు బిందువుల మెరుపును ఈ డ్రెస్‌లో రీ-క్రియేట్ చేయడం కోసం డిజైనర్ల బృందం ఏకంగా 490 గంటల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. ఇక ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా ఆధ్వర్యంలో, తన్వి చేంబుర్కర్ మేకప్‌తో అనన్యను ఒక డ్రీమీ బ్రైడ్‌గా మార్చేశారు.
లేటెస్ట్ సినిమాలు.. అదరగొడుతున్న లైనప్:
రీసెంట్‌గా 'బ్యాడ్ న్యూస్', 'కేసరి చాప్టర్ 2' వంటి చిత్రాలతో అలరించిన అనన్య ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్‌లు నటించింది. రీసెంట్ గా లక్ష్య సరసన ఆమె నటించిన రొమాంటిక్ డ్రామా 'చాంద్ మేరా దిల్' మూవీ సక్సెస్ అందుకుంది. ఒకవైపు వైవిధ్యమైన సినిమాలను చేస్తూ నే, మరోవైపు ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకుంటోంది. ఇక వెండితెరపై నటనతో మెప్పిస్తూనే, మరోవైపు గ్లామర్ ప్రపంచంలో తనదైన సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ అనన్య పాండే దూసుకుపోతోంది.
