'లైగర్' బ్యూటీ కొత్త ప్రేమికుడు ఇతడేనా?
అంబానీ కంపెనీలో పని చేసే విదేశీ మోడల్ వాంకర్ బ్లాంకోతో లైగర్ బ్యూటీ అనన్య పాండే ప్రేమాయణం కొంతకాలంగా మీడియా హెడ్ లైన్స్ లో కొస్తోంది.
By: Sivaji Kontham | 19 Jan 2026 4:00 AM ISTఅంబానీ కంపెనీలో పని చేసే విదేశీ మోడల్ వాంకర్ బ్లాంకోతో లైగర్ బ్యూటీ అనన్య పాండే ప్రేమాయణం కొంతకాలంగా మీడియా హెడ్ లైన్స్ లో కొస్తోంది. అనన్య క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతుంటే, బ్లాంకో మాత్రం అంబానీల `వంటారా` టూరిస్ట్ ప్లేస్ లో ఒక ఉద్యోగిగా జీవితాన్ని గడుపుతున్నాడు. షికాగో(అమెరికా)కి చెందిన మాజీ మోడల్ వాకర్ బ్లాంకో చాలా కాలం క్రితమే వంటారా- వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ లో ఉద్యోగంలో చేరాడు. అతడు అనన్యతో గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలను ఇప్పుడు దాదాపు నిజమని అభిమానులు నమ్ముతున్నట్టు కొన్ని బాలీవుడ్ మీడియాలు కథనాలు వండి వారుస్తున్నాయి.
ఆ ఇద్దరి మధ్యా లవ్ ఎప్పుడు మొదలైంది? అంటే... 2024 జూలైలో జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుకల నుండి వీరి మధ్య రిలేషన్ మొదలైందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అనన్య- వాకర్ మొదటిసారి అంబానీ కుటుంబం నిర్వహించిన క్రూయిజ్ పార్టీలో కలుసుకున్నారని సమాచారం. ఆ తర్వాత ముంబైలో జరిగిన పెళ్లి వేడుకల్లో అనన్య అతడిని తన `పార్టనర్` అని సన్నిహితులకు పరిచయం చేసినట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి ఊరేగింపు (బారాత్) లో వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఆటుపై వాకర్ `ఐ లవ్ యు` అంటూ పోస్ట్ ని షేర్ చేయడంతో అనుమానాలు మరింత ముదిరాయి. 2024 అక్టోబరులో అనన్య పుట్టినరోజు సందర్భంగా వాకర్ బ్లాంకో చేసిన `ఐ లవ్ యు` ఇన్‌స్టా పోస్ట్ ఈ బంధాన్ని దాదాపు ఖరారు చేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో అనన్య ఫోటోను షేర్ చేస్తూ-``హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్.. యు ఆర్ సో స్పెషల్.. ఐ లవ్ యు ..అనీ...! అని క్యాప్షన్ ఇచ్చాడు. అనన్యకు విదేశీ ప్రియుడు పెట్టిన ``అనీ`` అనే నిక్ నేమ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. మధ్యలో వీరిద్దరి మధ్య ఏదో ఉందనడానికి మరో బలమైన ఆధారం దొరికింది. అనన్యా పాండే ఒక సందర్భంలో `W` అక్షరం ఉన్న పెండెంట్‌ను ధరించి కనిపించింది. అది వాకర్ (Walker) పేరులోని మొదటి అక్షరమే అని అందరూ భావించారు.
వాకర్ బ్లాంకో ఎవరు? అంటే... అతడు అమెరికాలోని షికాగోకు చెందిన మాజీ మోడల్. ప్రస్తుతం అనంత్ అంబానీకి చెందిన `వంటార` వైల్డ్ లైఫ్ ప్రాజెక్టులో (జామ్‌నగర్, గుజరాత్) పనిచేస్తున్నారు. ఆయనకు వన్యప్రాణులు, సాహసయాత్రలంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు.
అయితే ఇటీవల `తు మేరీ మే తేరా మై తేరా తు మేరా` సినిమాలో కలిసి పని చేసిన తర్వాత కార్తీక్ ఆర్యన్‌తో ముడిపెడుతూ అనన్య పాండే గురించి చాలా పుకార్లు నడిచాయి. కార్తీక్ ఆర్యన్‌తో వచ్చిన తాత్కాలిక పుకార్ల తర్వాత మళ్ళీ అనన్య - వాకర్ బ్లాంకో మధ్య అనుబంధం బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2025 చివరలో ఒకరి పోస్టులపై ఒకరు చేసుకున్న కామెంట్స్ .. వారి సామాజిక మధ్యమాల్లోని యాక్టివిటీ వీరిద్దరూ ఇంకా రిలేషన్‌లోనే ఉన్నారని హింట్ ఇస్తున్నాయి.
గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసి 2024 ప్రారంభంలో విడిపోయిన తర్వాత అనన్య పేరు బలంగా వాంకర్ తో ముడిపెట్టి వినిపిస్తోంది. ఆదిత్య నుంచి విడిపోయిన తర్వాత ఆమె జీవితంలోకి వాకర్ బ్లాంకో వచ్చారు. వీరిద్దరూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా, వారి ప్రవర్తన మాత్రం అంతా స్పష్టంగానే చెబుతోంది.
అనన్య నటించిన లేటెస్ట్ సిరీస్ `కాల్ మీ బే` సీజన్-2 ఈ ఏడాది ద్వితీయర్థంలో స్ట్రీమ్ అవుతుంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా దానిపైనే...
