Begin typing your search above and press return to search.

మూడోసారి డేటింగ్ ఫెయిల్.. 'లైగ‌ర్' బ్యూటీ స‌మ‌స్యేంటి?

విజయ్ దేవరకొండ సరసన `లైగర్`చిత్రంలో నటించిన బాలీవుడ్ భామ అనన్య పాండే ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

By:  Sivaji Kontham   |   26 Aug 2026 6:15 PM IST
మూడోసారి డేటింగ్ ఫెయిల్.. లైగ‌ర్ బ్యూటీ స‌మ‌స్యేంటి?
X

విజయ్ దేవరకొండ సరసన `లైగర్`చిత్రంలో నటించిన బాలీవుడ్ భామ అనన్య పాండే ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో సాగించిన దాదాపు రెండేళ్ల ప్రేమాయణానికి ఈ బ్యూటీ స్వస్తి పలికినట్లు జాతీయ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ఎప్పుడూ ప్రకటించనా పలు బహిరంగ కార్యక్రమాలు , సోషల్ మీడియా పోస్టుల ద్వారా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు గతంలో బలంగా వినిపించాయి.

అనన్య పాండే-వాకర్ బ్లాంకోల పరిచయం 2024 మధ్యలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో మొదలైంది. చికాగోకు చెందిన మోడల్ వాకర్ వైల్డ్‌లైఫ్ - జంతు సంరక్షణపై ఆసక్తి కలిగి బాలీవుడ్ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనన్యతో ప్రేమలో పడిన త‌ర్వాత ప్రియురాలి పుట్టినరోజు సందర్భంగా `హ్యాపీ బర్త్‌డే బ్యూటిఫుల్.. ఐ లవ్ యు` అని పోస్ట్ చేయడం వీరి సంబంధానికి బలమైన రుజువుగా మారింది.

అంతేకాకుండా..అనన్య పాండే .. వాకర్ బ్లాంకో పేరును ఇనిషియ‌ల్‌తో కూడిన పెండెంట్‌ను ధరించడం కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా కథనాలు వెలువడుతున్నాయి. తమ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచడానికే ఇద్దరూ మొగ్గు చూపినా ఈ బ్రేక‌ప్ వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం అనన్య పాండే తన నటనా వృత్తిపైనే పూర్తి దృష్టి సారించారు. ప్రేమ -బంధాల గురించి గతంలో మాట్లాడిన ఈ యంగ్ బ్యూటీ షారుఖ్ ఖాన్ చెప్పినట్లు ``నాకు ప్రేమ అంటే స్నేహమే..అనుబంధంలో నమ్మకమే ప్రధానం`` అని వ్యాఖ్యానించారు. విడిపోయినా ఇన్‌స్టాలో వీరిద్దరూ ఇప్పటికీ ఒకరినొకరు ఫాలో చేసుకుంటుండటం విశేషం. యంగ్ హీరోలు ఇషాన్ ఖ‌ట్ట‌ర్, ఆదిత్యారాయ్ క‌పూర్ ల‌నుంచి విడిపోయిన త‌ర్వాత వాక‌ర్ బ్లాంకోతో మూడో డేటింగ్ కూడా ఫెయిల్ అవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

ఇదిలా ఉంటే.. అనన్య పాండే మాజీ ప్రియుడు ఇషాన్ ఖట్టర్ కూడా తన భాగస్వామి చాందినీ బైన్స్‌తో దాదాపు మూడేళ్ల బంధానికి ముగింపు పలికినట్లు కథనాలు రావడం గమనార్హం. అయితే ఈ బ్రేకప్ వార్తలపై అనన్య కానీ, వాకర్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.