లైగర్ భామ రెడ్ హాట్ లుక్ వైరల్
అనన్య కూడా బీచ్ లుక్‌లో కనిపించింది. ఆ తర్వాత పాత్రల మధ్య వాగ్యుద్ధం ప్రారంభమవుతుంది. ఇద్దరికీ ప్రేమపై భిన్నమైన దృక్పథాలు ఉంటాయి.
By: Sivaji Kontham | 23 Nov 2025 10:41 AM ISTవిజయ్ దేవరకొండ సరసన `లైగర్` చిత్రంలో నటించింది అనన్య పాండే. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం అందుకుంది. ఆ తర్వాత పాండే గాళ్ మరోసారి తెలుగు సినిమా మాటెత్తలేదు. అయినా బాలీవుడ్ లో మాత్రం వరుస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసనతు మేరీ మై తేరా మై తేరా తు మేరీ అనే చిత్రంలో నటిస్తోంది.
తాజాగా కార్తీక్ ఆర్యన్ 35వ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ టీజర్‌లో అనన్య - కార్తీక్ కెమిస్ట్రీని అభిమానులు ఆస్వాధిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో చాలా ప్రత్యేకమైన ప్రేమకథగా అభివర్ణిస్తున్నారు. టీజర్‌లో కార్తీక్ ఆర్యన్ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సన్నివేశంలోనే అతను షర్ట్ లేకుండా కనిపించాడు. అనన్య కూడా బీచ్ లుక్‌లో కనిపించింది. ఆ తర్వాత పాత్రల మధ్య వాగ్యుద్ధం ప్రారంభమవుతుంది. ఇద్దరికీ ప్రేమపై భిన్నమైన దృక్పథాలు ఉంటాయి. కాబట్టి ఈ సంఘర్షణ సినిమా ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. ఈ చిత్రంలో కార్తీక్ రే అనే నిర్లక్ష్య యువకుడి పాత్రను పోషిస్తుండగా, ఆధునిక హుక్అప్ సంస్కృతిలో 90ల నాటి ప్రేమకథ కోసం వెతుకుతున్న రూమి పాత్రను అనన్య పోషిస్తుంది.
అదంతా అటుంచితే ఈ మూవీ నుంచి అనన్య కొత్త లుక్ ఒకటి ఇంటర్నెట్ లో గుబులు రేపుతోంది. ఓ బిట్ సాంగ్ లో అనన్య ఎరుపు రంగు ఇన్నర్ ధరించి వెదర్ ని హీటెక్కించింది. అనన్య వేడెక్కించే ఒంపుసొంపులను ఈ లుక్ మరింతగా ఎలివేట్ చేసింది. సన్నజాజి తీగలా తీరైన రూపంతో మెరిసిపోయే అనన్య నెవ్వర్ బిఫోర్ లుక్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ యువతరం వాట్సాపుల్లో వైరల్ గా మారుతోంది.
అనన్య ఈ రొమాంటిక్ కామెడీపై చాలా హోప్స్ పెట్టుకుంది. కరణ్ జోహార్ `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దోస్తానా 2 గందరగోళం తర్వాత కరణ్ - కార్తీక్ మధ్య చాలా చర్చల తర్వాత ఇది మొదలైంది. కరణ్ - కార్తీక్ మధ్య వివాదాలు సమసిపోవడంతో అంతా సజావుగా సాగుతోంది. కార్తీక్ ఆర్యన్ మరియు అనన్య పాండేతో పాటు, ఈ చిత్రంలో నీనా గుప్తా, జాకీ ష్రాఫ్, మహిమా చౌదరి, ముష్తాక్ ఖాన్, గౌరవ్ పాండే వంటి ప్రముఖ నటులు కూడా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
