Begin typing your search above and press return to search.

కుమార్తె మిస్టేక్స్ అన్నిటినీ క‌వ‌ర్ చేస్తున్న గ్రేట్ పాపా

చిత్ర పరిశ్రమలో వారసత్వ న‌టులుగా అడుగుపెట్టిన స్టార్ కిడ్స్ నిరంతరం ప్రేక్షకుల- నెటిజన్ల నిఘాలోనే ఉంటారు.

By:  Sivaji Kontham   |   26 May 2026 11:38 PM IST
కుమార్తె మిస్టేక్స్ అన్నిటినీ క‌వ‌ర్ చేస్తున్న గ్రేట్ పాపా
X

చిత్ర పరిశ్రమలో వారసత్వ న‌టులుగా అడుగుపెట్టిన స్టార్ కిడ్స్ నిరంతరం ప్రేక్షకుల- నెటిజన్ల నిఘాలోనే ఉంటారు. వారు చేసే చిన్న పొరపాటునైనా సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే సైతం కెరీర్ ప్రారంభం నుండి అనేక విమర్శలను, ట్రోలింగ్‌లను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే కుమార్తె ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలోనూ, విమర్శల సమయంలోనూ ఆమె తండ్రి, సీనియర్ నటుడు చంకీ పాండే కేవలం ఒక తండ్రిగానే కాకుండా ఒక గొప్ప స్నేహితుడిగా అన‌న్య‌కు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తున్నారు. కుమార్తె వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ఆయన చూపిస్తున్న ఈ అండ నిజంగా గ్రేట్ అనిపించుకుంటోంది.

ముఖ్యంగా కుమార్తె అనన్యా పాండే కెరీర్ విషయంలో చంకీ పాండే ఎల్లప్పుడూ ఒక గైడ్‌లా వ్యవహరిస్తున్నారు. సినీ రంగంలో ఒడిదుడుకులు సహజమని నమ్మే ఆయన అనన్య కెరీర్ డల్ ఫేజ్‌లో ఉన్నప్పుడు.. నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పుడు అస్సలు నిరాశపడకుండా కూతురికి ధైర్యాన్ని నూరిపోశారు. పరిశ్రమలో విమర్శలను ఎలా స్వీకరించాలో తదుపరి ప్రాజెక్టులపై ఎలా దృష్టి పెట్టాలో నేర్పుతూ ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. ఒక నటిగా అన‌న్య‌ తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తూ కెరీర్ పరంగా ఎదుగుదలకు కావాల్సిన పూర్తి స్వేచ్ఛను, ప్రోత్సాహాన్ని అందిస్తూ తండ్రిగా తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు.

ఇక కుమార్తె వ్యక్తిగత జీవితం - డేటింగ్ విషయాలకొస్తే చంకీ పాండే ఆధునిక ఆలోచనలతో కూతురి నిర్ణయాలకు పూర్తి మద్దతునిచ్చారు. గతంలో అనన్యా పాండే, నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత వారిద్దరి బంధం బ్రేకప్ అవ్వడం వంటి పరిణామాలు నెట్టింట తీవ్రంగా చర్చ‌ల్లోకొచ్చాయి. ఆ సమయంలో మానసికంగా ఒత్తిడికి లోనైన కుమార్తెకు చంకీ పాండే కొండంత అండగా నిలిచారు. బ్రేక్‌అప్ వల్ల వచ్చే బాధ నుండి ఆమె త్వరగా కోలుకునేలా పక్కనే ఉండి నడిపించారు. ఒక తండ్రిగా కూతురి ప్రేమ, వ్యక్తిగత జీవిత నిర్ణయాలను తప్పుపట్టకుండా వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స‌హ‌క‌రించారు.

ఇవే కాకుండా, అనన్యా పాండే ఇరకాటంలో పడిన ఇతర తప్పుల సమయంలో లేదా విమర్శలు ఎదుర్కొన్న ప్రతిసారీ చంకీ పాండే ముందుండి ఆ బాణాలను తిప్పికొడుతున్నారు. తాజాగా `చాంద్ మేరా దిల్` మూవీలో అనన్యా పాండే భరతనాట్యాన్ని అవమానించేలా డాన్స్ చేశారంటూ సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ మొదలైంది. దీనిపై చంకీ పాండే తక్షణమే స్పందిస్తూ కూతురికి గట్టి మద్దతుగా నిలిచారు. అదొక క్రియేటివ్ ఫ్యూజన్ డాన్స్.. కాలేజ్ పిల్ల‌లు చేస్తుంటారు. ప్యూర్ గా భ‌ర‌త‌నాట్యం కాదు! అని వివ‌రించారు.