తొలిసారి ట్రెడిషనల్ లుక్ లో అనన్య.. చూపులకే దాసోహం!
ప్రస్తుతకాలంలో చాలామంది హీరోయిన్స్ తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.
By: Madhu Reddy | 6 Dec 2025 10:42 AM ISTప్రస్తుతకాలంలో చాలామంది హీరోయిన్స్ తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అందులో కొంతమంది గ్లామర్ తో ఆకట్టుకుంటే.. మరి కొంతమంది ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అబ్బురపరుస్తూ ఉంటారు. ఇంకొంతమంది గ్లామర్ తోనే హీట్ పెంచి సడన్ గా ట్రెడిషనల్ లుక్ లో కనిపించేసరికి అభిమానులు సైతం వారి అందానికి ముగ్ధులు అవుతున్నారు. అలాంటి వారిలో అనన్య పాండే కూడా ఒకరు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులలో హీట్ పుట్టించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఆరెంజ్ కలర్ సిల్క్ శారీ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్ లో ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ధరించి తన అందంతో ఆకట్టుకుంది. కొంటెగా ఫోటోలకు ఫోజులిస్తూ.. చూసే అభిమానుల హృదయాలు దోచుకుంది. ముఖ్యంగా అనన్య పాండేని ఇంత ట్రెడిషనల్ గా ఎప్పుడూ చూడలేదని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది చక్కగా బుట్ట బొమ్మలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ట్రెడిషనల్ లుక్ లో అందులోనూ చీరకట్టులో కనిపించి అందరిని మెస్మరైజ్ చేస్తోంది అనన్య పాండే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పేరు చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అనన్య పాండే కెరియర్ విషయానికి వస్తే.. ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. హిందీ, తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా ఈమె ఎవరో కాదు ప్రముఖ హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురు. ఈమె తాత ఎవరో కాదు ప్రముఖ హార్ట్ సర్జన్ శరద్ పాండే. 2019లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, అనన్య పాండే, ఆదిత్య సీల్ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా తర్వాత పతీ పత్నీ ఔర్ ఓ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే 2022లో ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ అమ్మడికి మళ్లీ తెలుగులో అవకాశాలు లభించలేదు. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే సయారా సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే అత్యధిక ప్రజాదారణ పొందిన నటుడిగా పేరు దక్కించుకున్నారు.
