Begin typing your search above and press return to search.

విమర్శించిన భామ‌కు సెకెండ్ ఛాన్స్ ఉంటుందా?

బాలీవుడ్ న‌టి అన‌న్యా పాండే `లైగ‌ర్` తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో? అమ్మ‌డు తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది.

By:  Srikanth Kontham   |   8 Nov 2025 2:00 AM IST
విమర్శించిన భామ‌కు సెకెండ్ ఛాన్స్ ఉంటుందా?
X

బాలీవుడ్ న‌టి అన‌న్యా పాండే `లైగ‌ర్` తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో? అమ్మ‌డు తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది. ఓ చెత్త సినిమాతో లాంచ్ అయి పెద్ద త‌ప్పు చేసాన‌ని ఓపెన్ గానే అనేసింది. కెరీర్ లో ఎదుర్కొన్న చెత్త రివ్యూ` లైగ‌ర్` దే అంది. నిర్మాత కర‌ణ్ జోహార్, త‌న త‌ల్లి చెప్ప‌డం వ‌ల్లే ఆ సినిమా చేసాన‌ని, లేదంటే నేనెందుకు న‌టిస్తానంటూ రుస రుస‌లాడింది. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు నెట్టింట తీవ్ర దుమారానే రేపాయి. ఆమె తీరుపై నెటి జ‌నులు మండి ప‌డ్డారు. న‌టిగా తొలి సినిమా అవ‌కాశం పూరి జ‌గ‌న్నాధ్ ఇవ్వ‌డ‌మేనా ఆయ‌న చేసిన త‌ప్పు? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.

బాలీవుడ్ లో బిజీగానే:

అమ్మ‌డిలో ఫైరింగ్ యాంగిల్ చూసి మ‌ళ్లీ తెలుగు సినిమాలు చేస్తుందా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది. అయితే తాజాగా అన‌న్యా పాండే టాలీవుడ్ పై తీరు మార్చుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అన‌న్య మ‌న‌సు మ‌ళ్లీ తెలుగు సినిమాలు కోరుకుంటున్న‌ట్లు బాలీవుడ్ లో ప్ర‌చారం మొద‌లైంది. హీరోయిన్ గా స‌రైన అవ‌కాశం వ‌స్తే న‌టించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు క‌థ‌నాలొస్తున్నాయి. `లైగ‌ర్` త‌ర్వాత బాలీవుడ్ లో అన‌న్యా పాండే ఆరేడు సినిమాలు చేసింది. వాటిలో రెండు..మూడు చిత్రాలు బాగానే ఆడాయి. అప్ప‌టి నుంచి బాలీవుడ్ లో అమ్మ‌డికి కెరీర్ కి తిరుగు లేదు.

ఆ రెండు రిలీజ్ ల త‌ర్వాత టాలీవుడ్ లో:

వ‌రుస అవ‌కాశాల‌తో మ‌రింత బిజీ అయింది. ప్ర‌స్తుతం హిందీలో `తూ మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తూ మేరీ`లో న‌టిస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే `చాంద్ మేరీ దిల్ `లోనూ నటిస్తోంది. ఈసినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అయితే ఈ రెండు సినిమాల త‌ర్వ‌త అనన్యా పాండే మ‌ళ్లీ తెలుగు సినిమాల‌పై దృష్టి పెడుతుంద‌ని తెలుస్తోంది. కానీ విమ‌ర్శించిన నోరుకు మ‌ళ్లీ సెకెండ్ ఛాన్స్ అన్న‌ది టాలీవుడ్ లో అంత సుల‌భం కాదు. ఓ సినిమాలో అవ‌కాశం క‌ల్పించే ముందు తెలుగు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు చాలా విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

సెకెండ్ ఛాన్స్ క‌ష్ట‌మేనా?

పూరి లా తొంద‌ర‌ప‌డి ఛాన్స్ ఇవ్వ‌రు. నెగిటివ్ కామెంట్లు....కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో అవ‌కాశాలు వ‌దుల‌కుని ప‌ర‌భాష‌ల వైపు చూసిన న‌టీమ‌ణుల‌కు, ప్ర‌చారానికి ఢుమ్మా కొట్టే హీరోయిన్లకు టాలీవుడ్ అంత సుల‌భంగా సెకెండ్ ఛాన్స్ ఇవ్వ‌దు. పూజాహెగ్డే స‌హా ప‌లువురు భామ‌లు టాలీవుడ్ లో అలాగే అవ‌కాశాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరో స‌ర‌స‌న అవ‌కాశం కోసం పూజాహెగ్డే చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఎలాంటి కామెంట్ చేయ‌ని న‌టి విష‌యంలోనే బ్యాకెండ్ లో హైడ్రామా న‌డుస్తోంది. అలాంటింది తెలుగు సినిమాను విమ‌ర్శించిన అన‌న్యకు సెకెండ్ ఛాన్స్ అంత ఈజీ కాదు.