పిక్‌టాక్ : పార్టీ మూడ్ లో ముద్దుగుమ్మలు
తాజాగా జరిగిన పార్టీలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ అనన్య పాండే, సుహాన ఖాన్ లు పాల్గొన్నారు. ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ఏమీ లేవు.
By: Ramesh Palla | 30 Oct 2025 11:20 AM ISTబాలీవుడ్‌లో పార్టీలు అనేవి చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. దీపావళి సీజన్ లో ఎంతో మంది సెలబ్రిటీలు పార్టీలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా హాజరు అయ్యే పార్టీలు జరుగుతూ ఉంటాయి. దీపావళి పార్టీలు మాత్రమే కాకుండా రెగ్యులర్‌గా ఏవో పార్టీలు జరుగుతూనే ఉంటాయి. బాలీవుడ్ స్టార్స్ సినిమాలతో కంటే ఎక్కువగా మీడియాలో పార్టీల కారణంగా ఉంటారు అనే టాక్ కూడా ఉంది. కొందరు ముద్దుగుమ్మలు సినిమాల్లో ఆఫర్లు లేకున్నా ఇలా పార్టీల్లో, సోషల్ మీడియాలో కనిపించడం ద్వారా వార్తల్లో నిలిచిన వారు ఉన్నారు. పార్టీలకు హాజరు అయితేనే ఇండస్ట్రీలో ఉన్నట్లు గుర్తిస్తారు అని చాలా మంది వ్యాఖ్యలు చేయడం మనం చూసే ఉన్నాం. పార్టీలకు హాజరు అయితేనే ఆఫర్లు రావడం జరుగుతుందని కొందరు ఇంటర్వ్యూల్లో మాట్లాడటం తెలిసిందే. తాజాగా అలాంటి పార్టీ ఫోటోలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ పార్టీలో ముద్దుగుమ్మలు...
తాజాగా జరిగిన పార్టీలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ అనన్య పాండే, సుహాన ఖాన్ లు పాల్గొన్నారు. ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ఏమీ లేవు. అయినా కూడా ఇద్దరికి మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి చాలా పార్టీల్లో పాల్గొనడం, అంతే కాకుండా రెగ్యులర్‌గా ఇద్దరూ జిమ్ లో వర్కౌట్స్ సమయంలో కలవడం వంటి కారణాల వల్ల మంచి స్నేహితులు అయ్యారు. ఆ స్నేహం కారణంగానే తాజాగా ఒక పార్టీలో ఇలా సరదాగా ఫోటోలకు ఫోజ్‌లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అనన్య పాండేకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అనన్య పాండే తన స్నేహితురాల్లతో కలిసి పార్టీలో పాల్గొనడంతో ఈ ఫోటోలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వైట్ టాప్ లో ఈ అమ్మడు మెరిసి పోతుంది అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
అనన్య పాండే, సుహాన ఖాన్‌ల ఫోటో...
సుహాన ఖాన్ సైతం వైట్ డ్రెస్ లో కన్నుల విందు చేసింది. హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా సుహాన ఖాన్ రెగ్యులర్‌గా ఫోటోలకు ఫోజ్‌లు ఇస్తూ నెట్టింట సందడి చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు అయిన సుహాన ఖాన్ సహజంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అందమైన సుహాన ఖాన్ సైతం బాలీవుడ్‌లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె ఒకటి రెండు సినిమాలను చేస్తుంది. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సుహాన ఖాన్ చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. సొంత ఇమేజ్ తో ఆఫర్లను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సుహాన ఖాన్ కి బాలీవుడ్‌లో మంచి బ్రేక్ దక్కాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే కెరీర్ లో అడుగు పెడుతున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలుస్తుందనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు.
లైగర్ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్‌లో...
ఇక అనన్య పాండే ఇప్పటికే బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన ఈ అమ్మడు తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. అయినా కూడా అనన్య పాండే తన అందంతో వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది. ఈ ఏడాది ఇప్పటికే కేసరి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తు మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తు మేరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అతి త్వరలోనే మరో రెండు సినిమాలను సైతం ఈమె మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. సౌత్ లో ఈమె మళ్లీ నటించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.
