చాక్లెట్ లుక్‌తో మతిపోగోడుతున్న అనన్య పాండే.. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ వైరల్!
ప్రస్తుతం అనన్య పంచుకున్న ఈ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తున్నాయి.
By: Madhu Reddy | 3 Sept 2026 3:00 PM ISTబాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే తాజాగా పంచుకున్న ఫోటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. ముంబైలో జరిగిన లగ్జరీ బ్రాండ్ వేడుకలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ, తన రాయల్ లుక్‌తో ప్రతీ ఒక్కరి దృష్టినీ ఆకర్షించింది. బ్రాంజ్ రంగు డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతూ కెమెరాలకు విభిన్నమైన పోజులిచ్చింది. ప్రస్తుతం అనన్య పంచుకున్న ఈ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తున్నాయి.
రాహుల్ మిశ్రా డిజైనర్ గౌన్‌లో మెరిసిన అనన్య:
లగ్జరీ స్విస్ వాచ్ అండ్ జ్యువెలరీ బ్రాండ్ 'పియాజె' ప్రమోషన్స్ కోసం అనన్య ప్రత్యేకంగా ముస్తాబైంది. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన "దేవి" కలెక్షన్‌లోని బ్రాంజ్ కలర్ ఫ్లోర్-లెంగ్త్ కౌచర్ గౌన్‌ను ఆమె ధరించింది. ఇక ఆమె ఫిట్నెస్ కు సరిగ్గా సరిపోయే పర్‌ఫెక్ట్ ఫిట్టింగ్‌తో ఉన్న ఈ గౌన్ ఆమె గ్లామర్‌ను మరింత ఎలివేట్ చేసింది.
డ్రెస్ డిజైన్ అండ్ రాయల్ స్టైలింగ్ :
ఈ బాడీ-స్కిమ్మింగ్ డ్రెస్ డీప్ వీ-నెక్ లైన్, నడుము వద్ద కిరీటంలా అనిపించే నాట్ నాట్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఇసుక తిన్నెల అలలను తలపించేలా ఉన్న క్లిష్టమైన ప్లీటింగ్, ఆర్టిస్టిక్ డ్రేపింగ్ స్టైల్ ఈ గౌన్‌కు హైలైట్‌గా నిలిచాయి. ప్రముఖ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా బదానీ ఈమెకు అత్యంత స్టైలిష్ లుక్ అందించగా, శిల్పంలా మెరిసిపోతున్న అనన్య అందం నెటిజన్లను మైమరపిస్తోంది.
'స్వీట్ ట్రీట్' అంటూ క్యూట్ క్యాప్షన్ :
ఈ అద్భుతమైన పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ "స్వీట్ ట్రీట్ పియాజె వేడుకలను జరుపుకుంటూ ఒక అందమైన సాయంత్రం" అని అనన్య రాసుకొచ్చింది. ఇక బ్రౌన్ కలర్ ఎమోజీలతో పోస్ట్ చేసిన ఈ పిక్స్ చూసి అభిమానులు లవ్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు.
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' నుంచి నేటి వరకు కెరీర్ :
కరణ్ జోహార్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనన్య, తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ ఉత్తమ పరిచయ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత 'పతీ పత్నీఔర్ వో' వంటి హిట్ చిత్రాల్లో నటించి తన బబ్లీ నటనతో మెప్పించింది. ఇక వరుస సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.
గ్లామర్‌కు సరికొత్త అర్ధాన్ని ఇస్తూ, ప్రతి ఫోటోషూట్‌లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్న అనన్య పాండే, రాబోయే రోజుల్లో తన ప్రాజెక్టులతో వెండితెరపై మరింత సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
