Begin typing your search above and press return to search.

లైట్ పర్పుల్ లుక్‌లో అనన్య పాండే మెస్మరైజ్.. ఫ్యాన్స్ ఫిదా!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, యూత్ ఐకాన్ అనన్య పాండే తన గ్లామర్, ట్రెండీ స్టైల్‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది.

By:  Madhu Reddy   |   18 Aug 2026 5:00 PM IST
లైట్ పర్పుల్ లుక్‌లో అనన్య పాండే మెస్మరైజ్.. ఫ్యాన్స్ ఫిదా!
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, యూత్ ఐకాన్ అనన్య పాండే తన గ్లామర్, ట్రెండీ స్టైల్‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. నటనలోనే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ భామ, తాజాగా షేర్ చేసిన స్పోర్టీ అండ్ స్టైలిష్ పిక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. జిమ్ వేర్‌లో సరికొత్త గ్లామర్‌తో మెరిసిపోతున్న అనన్య ఫొటోలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆమె స్టైలిష్ లుక్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..




స్పోర్టీ అండ్ స్టైలిష్ లుక్ :

ఈ ఫొటోషూట్‌లో అనన్య పాండే స్కెచర్స్ ఇండియా బ్రాండ్‌కు చెందిన లైట్ పర్పుల్ జియోమెట్రిక్ ప్రింటెడ్ యాక్టివ్‌వేర్ సెట్ ధరించారు. ఇందులో స్పోర్ట్స్ బ్రా, మ్యాచింగ్ హై-వేస్టెడ్ షార్ట్స్ ధరించి తన ఫిట్‌నెస్‌ను ఎలివేట్ చేశారు. ఇక దీనికి తోడు మింట్ గ్రీన్ స్కెచర్స్ స్నీకర్స్, వైట్ సాక్స్, హై పోనీటైల్ హెయిర్ స్టైల్‌తో ఎంతో క్యూట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారు.




సోషల్ మీడియాలో క్యాప్షన్ హల్‌చల్ :

తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అనన్య ఒక క్రేజీ క్యాప్షన్ జోడించారు. నా స్కెచర్స్ హాట్‌షాట్స్ ఇప్పుడు సిటీలోకి వచ్చాయి.. ఇవి నాకు బాగా నచ్చాయి.. మీరు కూడా మీవి వెంటనే సొంతం చేసుకోండి" అంటూ స్కెచర్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు.




ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం:

అనన్య గ్లామరస్ పోజులు, జిమ్ లుక్ చూసి అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ప్రెటీ", "నాచురల్ బ్యూటీ" అంటూ ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. స్పోర్టివ్‌గా ఉంటూనే ఇంత గ్లామరస్‌గా ఎలా కనిపించవచ్చో అనన్య తన లుక్‌తో మరోసారి నిరూపించిందని కామెంట్స్ చేస్తున్నారు.




కెరీర్‌లో వరుస మూవీస్ :

ఫ్యాషన్ సెన్స్‌తోనే కాకుండా నటిగా కూడా అనన్య బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఇక సైబర్ థ్రిల్లర్ 'CTRL', హిట్ కామెడీ సిరీస్ 'కాల్ మీ బే'తో ఆకట్టుకున్న ఈ భామ, ప్రస్తుతం చారిత్రక నేపథ్యంతో వచ్చిన 'కేసరి చాప్టర్ 2' అలాగే లక్ష్య సరసన రొమాంటిక్ డ్రామా 'చంద్ మేరా దిల్' సినిమాల్లో నటించి మెప్పించారు.

ఇక ఒకవైపు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, మరోవైపు ఫ్యాషన్ ప్రయోగాలతో కుర్రకారును ఆకట్టుకుంటున్న అనన్య పాండే, రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.