Begin typing your search above and press return to search.

జాంబీ క‌థ‌తో యంగ్ బ్యూటీ ప్ర‌యోగం

టాలీవుడ్ కోలీవుడ్ లో జాంబీ సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు ప్ర‌యోగాల‌కు వెన‌కాడేది లేద‌ని నిరూపించారు. తెలుగులో జాంబి రెడ్డి లాంటి ప్ర‌యోగాత్మ‌క సినిమాతో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

By:  Sivaji Kontham   |   1 Sept 2025 9:19 AM IST
జాంబీ క‌థ‌తో యంగ్ బ్యూటీ ప్ర‌యోగం
X

టాలీవుడ్ కోలీవుడ్ లో జాంబీ సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు ప్ర‌యోగాల‌కు వెన‌కాడేది లేద‌ని నిరూపించారు. తెలుగులో జాంబి రెడ్డి లాంటి ప్ర‌యోగాత్మ‌క సినిమాతో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. బాలీవుడ్ లో తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే గో గోవా గాన్ లాంటి జాంబీ సినిమాని తెర‌కెక్కించి హిట్ కొట్టారు. కోలీవుడ్ లో జ‌యం ర‌వి ఇలాంటి ప్ర‌యోగం చేసాడు.

అదంతా అటుంచితే ఇప్పుడు స్పర్ష్ శ్రీవాస్తవ - అనన్య పాండే జోడీ జాంబీ క‌థ‌తో ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుడుతోంది. ద‌ర్శ‌కుడు ఇత‌ర వివరాల‌ను ప్ర‌స్తుతానికి దాచి ఉంచారు. అయితే జాంబీ క‌థ‌లో అన‌న్య పాండే సూట‌వుతుందా లేదా? అన్న‌ది ఇంకా డిసైడ్ చేయ‌లేము.

అయితే జాంబీ క‌థ‌ల‌తో ఇప్ప‌టికే సినిమాలు వ‌చ్చాయి కాబ‌ట్టి వాట‌న్నిటి కంటే భిన్న‌మైన కాన్సెప్టుతో స్ప‌ర్శ్ బృందం తాజా జాంబీ సినిమాని తీయాల్సి ఉంటుంది. జాంబీ క‌థ‌లు అన‌గానే మిలా జోవిచ్ రెసిడెంట్ ఈవిల్ ఫ్రాంఛైజీ గుర్తుకు వ‌స్తుంది. దానికి భిన్నంగా ఇప్పుడు ఇండియ‌న్ నేటివిటీ స్టోరీతో జాంబీ సినిమాల‌ను తెర‌కెక్కించాల్సి ఉంటుంది. మంచి కంటెంట్ ప‌డితే కేవ‌లం భార‌తీయ బాక్సాఫీస్ నుంచి 500 కోట్లు మించి వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది.

ఈరోజుల్లో జాన‌ర్ ఏదైనా కానీ కంటెంట్ చాలా ముఖ్యం. న‌టీన‌టులు ఎవ‌రు? అనేది ఎవ‌రూ చూడ‌టం లేదు. సినిమా చూస్తున్నంత సేపూ ఎమోష‌న్ తో క‌నెక్ట‌వ్వ‌డం ఇంపార్టెంట్. ఇప్పుడు అన‌న్య పాండే - స్ప‌ర్శ్ జోడీ అలాంటి ఒక మ్యాజిక్ చేస్తార‌నే ఆశిస్తున్నారు.