Begin typing your search above and press return to search.

గిన్నిస్ రికార్డ్ సెలబ్రేషన్‌లో అనన్య పాండే.. లండన్‌లో?

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం తన యూరప్ టూర్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది.

By:  Madhu Reddy   |   13 July 2026 3:38 PM IST
గిన్నిస్ రికార్డ్ సెలబ్రేషన్‌లో అనన్య పాండే.. లండన్‌లో?
X

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం తన యూరప్ టూర్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్, వింబుల్డన్ మ్యాచ్‌ల తర్వాత ఈ ముద్దుగుమ్మ లండన్‌లోని ప్రసిద్ధ హైడ్ పార్క్‌లో జరిగిన పిట్‌బుల్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో సందడి చేసింది. కేవలం పాటలతో ఊగిపోవడమే కాదు, ఏకంగా ఒక సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కు సాక్ష్యంగా నిలిచింది ఈ బ్యూటీ. ఆ నైట్ జరిగిన హిస్టారికల్ మూమెంట్స్ విశేషాలు చూద్దాం..





లండన్ కాన్సర్ట్‌లో అనన్య రచ్చ :

లండన్‌లో ప్రతి ఏటా జరిగే అతిపెద్ద అవుట్‌డోర్ మ్యూజిక్ ఫెస్టివల్ 'బ్రిటిష్ సమ్మర్ టైమ్' లో ప్రముఖ ర్యాపర్ పిట్‌బుల్ లైవ్ షో ఇచ్చారు. ఈ షోకు హాజరైన అనన్య పాండే అక్కడి ఇన్ సైడ్ ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక పిట్‌బుల్ ఫేమస్ సాంగ్ 'రైన్ ఓవర్ మీ' కి వేలాది మంది అభిమానులతో కలిసి అనన్య పాండే డ్యాన్స్ చేస్తూ, పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేసింది.





అదిరిపోయే కొత్త గిన్నిస్ రికార్డ్:

ఈ మ్యూజిక్ నైట్ కేవలం పాటల కోసమే కాదు, ఒక అరుదైన గిన్నిస్ రికార్డ్ కోసం కూడా చరిత్రలో నిలిచిపోయింది. పిట్‌బుల్ సిగ్నేచర్ లుక్ అయిన బాల్ హెడ్, తెల్ల చొక్కా, నల్ల టై, ఏవియేటర్ సన్‌గ్లాసెస్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఏకంగా 22,000 మందికి పైగా ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు. అంతమంది ఒకే చోట గుండు క్యాప్స్ ధరించి రావడంతో.. "ప్రపంచంలోనే అత్యధిక మంది గుండు క్యాప్స్ పెట్టుకుని ఒకే చోట చేరిన" సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది.





నేను కూడా లెక్కలోకి వస్తా అన్న పిట్‌బుల్:

ఈ అద్భుతమైన రికార్డ్ కోసం స్వయంగా పిట్‌బుల్ కూడా స్టేజ్ మీద గుండు క్యాప్ వేసుకుని రికార్డులో భాగమయ్యాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. "నాకు మాటలు రావడం లేదు. ఒక సాధారణ క్యూబన్ కుటుంబం నుంచి వచ్చిన నేను ఇలాంటి రికార్డులు సృష్టిస్తానని అస్సలు అనుకోలేదు" అంటూ ఎమోషనల్ అయ్యాడు.





అనన్య స్టైలిష్ లుక్:

ఈ హిస్టారికల్ ఈవెంట్ కోసం అనన్య చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించింది. డార్క్ కలర్ బటన్-డౌన్ టాప్, లూజ్ ఫిట్టింగ్ బాటమ్స్ వేసుకుని కాన్సర్ట్ కి వచ్చింది. అందరిలా తను గుండు క్యాప్ పెట్టుకోకపోయినా, ఒక కలర్‌ఫుల్ బందానా హెయిర్ బ్యాండ్‌తో తన సిగ్నేచర్ హెయిర్‌స్టైల్‌ను మెయింటైన్ చేసింది.





"మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాం.. ఐ లవ్ యు పిట్‌బుల్" అంటూ అనన్య పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన రికార్డ్ మూమెంట్‌లో భాగమవ్వడం అనన్య పాండేకు లైఫ్ టైమ్ మెమొరీగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.