రియల్ బార్బీని తలపిస్తున్న అనన్య పాండే
బాలీవుడ్ యంగ్ బ్యూటీ, ట్రెండ్ సెట్టర్ అనన్యా పాండే అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై మరోసారి భారత్ గర్వపడేలా చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతోన్న ప్రతిష్టాత్మక `పారిస్ హాట్ కోచర్ వీక్` వేడుకల్లో సందడి చేశారు.
By: Sivaji Kontham | 9 July 2026 4:00 AM ISTబాలీవుడ్ యంగ్ బ్యూటీ, ట్రెండ్ సెట్టర్ అనన్యా పాండే అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై మరోసారి భారత్ గర్వపడేలా చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతోన్న ప్రతిష్టాత్మక `పారిస్ హాట్ కోచర్ వీక్` వేడుకల్లో సందడి చేశారు. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ `ఛానెల్` నిర్వహించిన హాట్ కోచర్ షోకు అనన్యా పాండే హాజరై తన స్టైలిష్ అప్పియరెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఛానెల్ బ్రాండ్‌కు భారతదేశం తరపున మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా చరిత్ర సృష్టించిన అనన్యా ఈ గ్లోబల్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్ కోసం అనన్యా పాండే ఎంచుకున్న కాస్ట్యూమ్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ క్లాసిక్ డెనిమ్ లుక్- డబుల్-డెనిమ్ స్టైల్ ఫోటోలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. దీనికి తోడు బ్లాక్ అండ్ వైట్ హీల్స్, చేతిలో క్లాసిక్ ఛానెల్ బ్యాగ్‌తో తన లుక్ అదరగొట్టింది.
ఈ పారిస్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను అనన్యా పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ..`పారిస్! బండానాస్! ఛానెల్ బ్యూటీ! కాప్రిస్! ఫ్రెంచ్ టోస్ట్! ఐ యామ్ అబ్సెస్డ్` అంటూ క్యాప్షన్ పెట్టారు. పారిస్ నగరం, అక్కడి వాతావరణం, ఫ్రెంచ్ టోస్ట్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అనన్య పేర్కొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేవలం రెండు గంటల్లోనే లక్షకు పైగా లైకులతో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు హాజరైన ఈ షోలో అనన్యా తన కాన్ఫిడెన్స్, స్మార్ట్ స్టైలింగ్‌తో ప్రత్యేకంగా హైలైట్ అయ్యారు.
అనన్యా పోస్ట్‌పై తన స్నేహితులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు శనాయా కపూర్, భావనా పాండే, అమృతా అరోరా, డిజైనర్ మసాబా గుప్తా తదితరులు హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తపరిచారు. నెటిజన్లు ఈ బ్యూటీని `రియల్ బార్బీ`, `ఫ్యాషన్ ఐకాన్`, `ఇట్ గర్ల్`అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ ఫోటోలలో ఒక చోట కనిపించిన కొన్ని ఫన్నీ బోర్డులపై సైతం నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.
డెనిమ్ అనేది ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి ఎస్కేప్ అవ్వని దుస్తులు అని.. దాన్ని గ్లోబల్ ఈవెంట్ కోసం ఎలా ఎలివేట్ చేయాలో అనన్యా తన లుక్‌తో నిరూపించారని ఫ్యాషన్ విశ్లేషకులు కొనియాడుతున్నారు. హాలీవుడ్, అంతర్జాతీయ స్టార్ల మధ్య అనన్యా పాండే లగ్జరీ డెనిమ్ లుక్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలతోనే కాకుండా ఇటు అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలోనూ తన బ్రాండ్ వాల్యూను భారీగా పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఇక అనన్య పాండే సోషల్ మీడియాల్లో భారీ ఆదాయం ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే.
