Begin typing your search above and press return to search.

నెపోటిజం విమర్శలపై అనన్య పాండే స్ట్రాంగ్ కౌంటర్!

బాలీవుడ్‌లో నెపోటిజం విమర్శలు ఎదుర్కొంటున్న అనన్య పాండే తన ప్రివిలేజ్‌ను ఎప్పుడూ దాచలేదని చెప్పింది. చంకీ పాండే కుమార్తెగా ఉండటం గర్వంగా భావిస్తున్నానని, తన అదృష్టాన్ని అంగీకరిస్తున్నానని తెలిపింది. జెన్ జీ యువతపై విమర్శలను ఖండించిన ఆమె, బాలీవుడ్‌లో నటులు, సిబ్బంది భద్రత పెంచాలని అభిప్రాయపడింది.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 3:50 PM IST
నెపోటిజం విమర్శలపై అనన్య పాండే స్ట్రాంగ్ కౌంటర్!
X

నెపోటిజంపై నిత్యం మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు ఆస‌క్తిని పెంచుతూనే ఉంటాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ లో వార‌స‌త్వం అన్న‌ది ఎప్ప‌టికీ తెగ‌ని పంచాయ‌తీనే. ఈ అంశంపై ఎవ‌రి అభిప్రాయాలు వారివి. ఎవ‌రి కోణంలో వారు స‌మ‌ర్దించుకుంటూనే ఉంటారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ న‌టి అన‌న్యా పాండే కూడా స్పందించింది. ఈ అమ్మ‌డి పై కూడా నెపోకిడ్ అనే విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. చుంకీ పాండే వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చింద‌నే విమ‌ర్శ తొలి నుంచి ఎదుర్కుంటూనే ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ దీనిపై పెద్ద‌గా స్పందించని అన‌న్య తొలిసారి కాస్త లోతుగానే మాట్లాడిన‌ట్లు క‌నిపిస్తుంది.

ఓసారి ఆవివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నెపోటిజం ట్యాగ్‌ను ఎదుర్కొంటున్న అనన్య తన ప్రివిలేజ్‌ను ఎప్పుడూ దాచిపెట్టలేదంది. `నేను నా తండ్రి కూతురు అయినందుకు చాలా గర్విస్తున్నాను. చంకీ పాండేతో ఉన్న ఆ అనుబంధానికి ఎప్పుడూ ఎలాంటి వ్యతిరేక భావాలను అంటగట్టాలని కోరుకోను` అంది. ప్రజలు తన గురించి ఏమ‌నుకున్నా? ప్రతిరోజూ ఉదయం లేవగానే కలల ప్రపంచంలో బతుకుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతానంది. ఆర‌కంగా తాను ఎంతో అదృష్టవంతురాలినని నిజాయితీగా అంగీకరించింది.

అలాగే జెన్ జీ యువతపై వ‌స్తోన్న విమర్శలను అనన్య తిప్పకొట్టింది. నేటి యువత సోమరిపోతులని.. బాధ్యతారహితులని కొందరు భావిస్తారని కానీ అది పూర్తిగా అబద్ధమని ఖండించింది. పాత తరంతో పోలిస్తే ప్రస్తుత జనరేషన్ విజయం సాధించే విధానాన్ని, మార్గాలను పూర్తిగా భిన్నంగా చూస్తుందంది. వ్యక్తిగతంగా గంటల తరబడి పనిచేయడాన్ని ఇష్టపడతానని.. అయితే తమ తరంలో ఎవరైనా తక్కువ కష్టపడి కూడా గొప్ప విజయాలు సాధిస్తే అది వారి జీవన విధానమని సమర్థించింది. అలాగే బాలీవుడ్ లో నెలకొన్న భయానక వాతావరణంపై కూడా అనన్య ఆందోళన వ్యక్తం చేసింది.

ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్‌కు ఎదురైన బెదిరింపుల ఉదంతాన్ని ప్రస్తావించింది. ఇండస్ట్రీలో భద్రతా ప్రమాణాలు మరింత కఠినంగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇది నటుల భద్రతకు మాత్రమే సంబంధించిన విషయం కాదని.. షూటింగ్ స్థలాల్లో ఉండే సాధారణ జనం .. సిబ్బంది రక్షణ కూడా ఎంతో ముఖ్యమంది. ఇక అన‌న్యా పాండే సినిమాల విష‌యానికి వ‌స్తే అమ్మ‌డి వేగం బాగా త‌గ్గింది.

గ‌త ఏడాది రెండు సినిమాల‌తో అల‌రించిన బ్యూటీ ఈ ఏడాది ఒక సినిమాతోనే స‌రిపెట్టుకుంది. ప్ర‌స్తుతం కొత్త ప్రాజెక్టులు ఏవైనా క‌మిట్ అయిందా? అంటే అదీ లేదు. కానీ కెరీర్ ని మాత్రం బాలీవుడ్ లో స్థిర‌ప‌రుచుకోవాల‌నే బ‌ల‌మైన ఆశ‌యంతో ఉంది. ఆరంభంలో టాలీవుడ్ లో ఓ సినిమా చేసి త‌ప్పు చేసాన‌ని చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ తెలుగు సినిమాల్లో అవ‌కాశం రావ‌డం క‌ష్ట‌మే అన్న‌ది అర్ద‌మ‌వుతుంది.