Begin typing your search above and press return to search.

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

నేటి తరం యువత ప్రేమలో రాజీపడేందుకు సిద్ధంగా లేదని బాలీవుడ్ నటి అనన్య పాండే అభిప్రాయపడింది. నిజమైన ప్రేమపై నమ్మకం ఉన్నప్పటికీ అంచనాలు పెరగడంతో నచ్చని బంధానికి 'నో' చెప్పే స్వేచ్ఛ యువతకు వచ్చిందని తెలిపింది. తాను రొమాంటిక్ వ్యక్తినని, భవిష్యత్తులో పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని ఉందని వెల్లడించింది.

By:  Srikanth Kontham   |   20 Nov 2026 11:05 PM IST
నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!
X

పెళ్లి అంటే ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన బంధాలకే పరిమితమయ్యేది. కానీ కాలక్రమేణా ప్రేమించి పెళ్లి చేసుకునే సంస్కృతి పెరిగింది. కానీ ఇప్పుడు ఆ రెండింటి విషయంలోనూ యువత ఆలోచనలు కొత్త మలుపు తిరుగు తున్నాయన్న‌ది కాద‌న‌లేని నిజం. బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం సర్దుకుపోవడం కంటే మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడే ముందుకెళ్లాలనే క్లారిటీ నేటి తరం యువతలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ న‌టి అనన్య పాండే అభిప్రాయాన్ని పంచుకుంది.

`ఇప్పటి తరం యువతలో నిజమైన ప్రేమ కోసం తపన ఇంకా బతికే ఉందని కానీ ప్రమాణాలు పెరిగిపోవడంతో దేనికీ రాజీ పడటానికి మాత్రం సిద్ధంగా లేరని వ్యాఖ్యానించింది. గతంతో పోలిస్తే ప్రేమలో ఎన్నో ఎంపికలు ఉన్నా? నిజమైన ప్రేమను కోరుకునే స్వభావంలో మార్పు లేదని పాతకాలపు ప్రేమకథలపై ఉన్న నోస్టాల్జియా వల్లే అంచనాలు భారీగా పెరిగాయని అభిప్రాయపడింది. పాత రోజుల్లో కూడా పెళ్లి .. బంధాల పట్ల ఇలాంటి సంశయాలు ఉండేవేమో కానీ అప్పుడు వద్దని చెప్పే స్వేచ్ఛ చాలామందికి ఉండేది కాదని తెలిపింది.

ప్ర‌స్తుతం మాత్రం చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను చూస్తూ నచ్చని అంశాన్ని నిర్మొహమాటంగా వద్దని చెప్పే ధైర్యం ఈ తరం యువతకు వచ్చిందని చెప్పుకొచ్చింది. అలాగే అన‌న్యా పాండే వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉంటాయ‌న్న‌ది రివీల్ చేసింది. తాను ఎంతో రొమాంటిక్ స్వభావం ఉన్న అమ్మాయినని వెల్లడించింది. ప్రేమ ఎంతో ముఖ్యమని.. ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని తనకూ కోరిక ఉందని తెలిపింది. తన చుట్టూ ఉన్న స్నేహితుల ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయని చెప్పుకొచ్చింది.ఈ విష‌యంలో త‌న ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న స్నేహితులు దొర‌క‌డంలో ల‌క్కీ అంది. త‌న ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా ఉన్న స్నేహితులు దొరికితే గ‌నుక అది ఎక్క‌డైనా బ్రేక్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉండేద‌ని కానీ ఆ ఛాన్స్ మాత్రం లేద‌నేసింది.

ఇక ఈ బ్యూటీ సినిమాల విష‌యానిక వ‌స్తే? ఈ ఏడాది `చాంద్ మేరా దిల్` చిత్రంతో అనన్య ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న `కాల్ మీ బే సీజన్ 2`తో మరోసారి అలరించడానికి సిద్ధమవుతుంది. ఈ అమ్మ‌డు టాలీవుడ్ కి `లైగ‌ర్` సినిమాతో ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో మ‌రో ఛాన్స్ రాలేదు. అప్ప‌టి నుంచి అమ్మ‌డు బాలీవుడ్ లోనే కొన‌సాగుతోంది.