Begin typing your search above and press return to search.

సముద్రంలో హీట్ పెంచిన అనన్య.. గ్లామర్ తోనే చంపుతోందిగా!

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అంటే అందరికీ సుపరిచితమే. తెలుగులో అనన్య పాండే పేరు చెప్పగానే విజయ్ దేవరకొండ తో నటించిన లైగర్ మూవీనే గుర్తుకొస్తుంది.

By:  Madhu Reddy   |   13 Sept 2025 12:00 AM IST
సముద్రంలో హీట్ పెంచిన అనన్య.. గ్లామర్ తోనే చంపుతోందిగా!
X

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అంటే అందరికీ సుపరిచితమే. తెలుగులో అనన్య పాండే పేరు చెప్పగానే విజయ్ దేవరకొండ తో నటించిన లైగర్ మూవీనే గుర్తుకొస్తుంది. లైగర్ మూవీలో అనన్య పాండే హద్దులు మీరి రొమాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయిపోయింది.ఇది తెలుగులో ఈమెకు తొలి సినిమా అయినప్పటికీ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఈమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అనన్య పాండే తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందర్నీ అలరిస్తోంది.

చాలామంది హీరో, హీరోయిన్లు ముఖ్యంగా హీరోయిన్లు సమయం దొరికితే చాలు వెకేషన్ లకి వెళ్తూ ఉంటారు. అలా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ లేకపోతే తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రొమాంటిక్ వెకేషన్ లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.ఎక్కువగా అనన్య పాండే బికినీ ఫోటోల ద్వారా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటి బికినీ వేసుకొని ఏకంగా సముద్రం మధ్యలో నిల్చొని ఉన్న ఫోటోని అనన్య పాండే షేర్ చేయడంతో చాలామంది అభిమానులు ఆ ఫోటోకి హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు.

అలా తాజాగా అనన్య పాండే మాల్దీవ్స్ లోని నల్లటి చీకటిలో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసుకుంది. ఇక ఈ ఫోటో చూసినా చాలా మంది నెటిజన్లు నల్లటి వెన్నెల రాత్రిలో తెల్లటి చందమామ లాగా అనన్య పాండే తన అందంతో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. సముద్రం వ్యూ తో అనన్య పాండే షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇక మాల్దీవ్స్ వెకేషన్ కి సంబంధించిన సముద్రం ఫోటోలతో పాటు అక్కడ తిన్న ఫుడ్, కాఫీ ఇలా ప్రతి ఒక్క ఫోటోని షేర్ చేసింది.

ఇక అనన్య పాండే విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మ కి బాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం పేరు తెచ్చుకోలేక పోయింది. అనన్య పాండే సినిమాల విషయానికొస్తే.. ఆమె చివరిగా కేసరి చాప్టర్ 2 అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చాంద్ మేరా దిల్ అనే సినిమా ఉంది.