Begin typing your search above and press return to search.

హీట్ పెంచేసిన అనన్య.. కుర్రకారు ఏమైపోతారో..

అనన్య పాండే చిత్రాల విషయానికొస్తే.. కార్తీక్ ఆర్యన్ తో కలిసి రొమాంటిక్ డ్రామా ' తు మేరీ మెయిన్ తేరా, మెయిన్ తేరా తు మేరీ ' సినిమాలో నటిస్తోంది.

By:  Madhu Reddy   |   6 Dec 2025 8:23 PM IST
హీట్ పెంచేసిన అనన్య.. కుర్రకారు ఏమైపోతారో..
X

ప్రముఖ హార్ట్ సర్జన్ శరద్ పాండే మనవరాలిగా.. ప్రముఖ సినీ సెలబ్రిటీ చుంకీ పాండే కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.. బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న అనన్య పాండే.. అందులో భాగంగానే ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

ఇందులో తన నటనతో ఆకట్టుకుంది కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా మారింది. సినిమా ఫ్లాప్ అవడంతో అమ్మడికి నిరాశ ఎదురయింది. కనీసం ఈమె నటన చూసి అవకాశాలు వస్తాయని అభిమానులు అనుకున్నారు. కానీ ఆ అవకాశం మళ్ళీ లభించలేదు. ఇక బాలీవుడ్ లోనే సెటిలైపోయిన ఈమె అక్కడే పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే మరొకవైపు అభిమానులను అలరించడానికి, ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి నిత్యం సోషల్ మీడియాలో అక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో హీట్ పెంచుతోంది.

అలా ఎప్పటికప్పుడు అందాలతో ఆకట్టుకునే ఈమె ఈరోజు ఉదయం సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతలోనే మళ్లీ బికినీనీ తలపించేలా దుస్తులు ధరించి మెస్మరైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో బికినీ ధరించిన ఈమె ఆ తర్వాత కొన్ని రకాల ఫోటోలను కూడా షేర్ చేసింది. అందులో హీట్ పుట్టించేలా ఫోటోలకు ఫోజులిచ్చిన తీరుకు కుర్రకారు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తే.. మరి కొంతమంది లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ.. ఆ ఫోటోలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం అనన్య పాండే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అనన్య పాండే చిత్రాల విషయానికొస్తే.. కార్తీక్ ఆర్యన్ తో కలిసి రొమాంటిక్ డ్రామా ' తు మేరీ మెయిన్ తేరా, మెయిన్ తేరా తు మేరీ ' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ ఆఖరున లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే అనన్య ఈ ఫోటోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు క్యాప్షన్ లో మొదటి చిత్రాలలో అనన్య చిరాకుగా ఉన్నా చివరి ఫోటోలో రూమీతో కలసి వారి ప్రేమను పొందడం చాలా క్రేజీగా ఉంది అంటూ క్యాప్షన్ జోడించింది. ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అలాగే లక్ష్య అనే సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. అలాగే చాంద్ మేర దిల్ తో పాటు కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.