Begin typing your search above and press return to search.

లెహంగాలో కట్టిపడేస్తున్న అనన్య పాండే.. ప్రత్యేకత ఏమిటంటే?

కొన్నిసార్లు మనకు మనం వేసుకునే బట్టలు విపరీతమైన అందాన్ని తీసుకొస్తాయి. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోవచ్చు.

By:  Madhu Reddy   |   10 Nov 2025 6:00 AM IST
లెహంగాలో కట్టిపడేస్తున్న అనన్య పాండే.. ప్రత్యేకత ఏమిటంటే?
X

కొన్నిసార్లు మనకు మనం వేసుకునే బట్టలు విపరీతమైన అందాన్ని తీసుకొస్తాయి. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోవచ్చు. కానీ అదే వాస్తవం. పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేసినా ఖుషీ సినిమాలోనే ఎక్కువ అందంగా ఎందుకు కనిపిస్తారు అంటే పవన్ కళ్యాణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్. ఆ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు రేణు దేశాయ్. అయితే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే తమ భర్తను ఎలా చూపించాలో తన భార్యకు బాగా తెలుసు అని ఫీలింగ్ కలిగింది.




అలానే సమంత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఏం మాయ చేసావే సినిమాలో తన కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. సింపుల్గా అందంగా కనిపించేటట్లు ఆ సినిమా కాస్ట్యూమ్స్ ఉంటాయి. చాలా సందర్భాల్లో కాస్ట్యూమ్స్ మాత్రమే మంచి బ్యూటీ ను తీసుకొస్తాయి. కొన్ని పీరియాడిక్ సినిమాల్లో కూడా కాస్ట్యూమ్స్ అనేవి కీలకపాత్రను పోషిస్తాయి. అయితే చాలామంది సెలబ్రిటీలు కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కనిపించేటప్పుడు అద్భుతమైన కాస్ట్యూమ్స్ వేసుకుంటారు.




తాజాగా సోషల్ మీడియాలో అనన్య పాండే ఫోటోలు వైరల్ గా మారాయి. అనన్య పాండే వేసుకున్న లెహంగాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం కుర్రకారు సైతం కామెంట్స్ తో పొగడడం మొదలుపెట్టారు. అయితే ఈ లెహంగాను భూమికా శర్మ డిజైన్ చేశారు. ఇది దాదాపు 1.1 లక్షలని తెలుస్తుంది.




అయితే కాస్ట్ కూడా ఆ లుక్ లో కనిపిస్తుంది. ఆ లెహంగాను అనన్య పాండే ధరించిన తర్వాత ఆ రిచ్ ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు అద్భుతమైన లెహంగా ధరించి అందరిని ఆకట్టుకుంది. గ్రీన్ గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ లెహంగాపై వైట్ కలర్ ఎంబ్రాయిడరీ తో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఒక ఈవెంట్ లో భాగంగా గ్లామర్ తో ఆకట్టుకున్న ఈమె మరొకవైపు ఇలా ట్రెండీ ఔట్ఫిట్ లో కనిపించి అభిమానులను అలరించింది. తాజాగా అనన్య పాండే ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

అనన్య పాండే విషయానికి వస్తే.. హిందీలో చాలా సినిమాలు చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద లైగర్ సినిమా ఊహించని ఫలితాన్ని అందుకోలేకపోయింది. అందుకని తెలుగులో మళ్లీ అనన్యకు అవకాశాలు రాలేదు.

లైగర్ సినిమా సక్సెస్ అయి ఉంటే మన తెలుగు దర్శకులు అనన్య వెంటపడేవాళ్లు. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా కూడా చాలామంది తెలుగు యువత ఆమెను సోషల్ మీడియా వేదికలో ఫాలో అవుతూ ఉంటారు. తన ఇంస్టాగ్రామ్ పోస్టులతో కూడా చాలామంది అభిమానులకు దగ్గరగా ఉంటుంది అనన్య.