పగడపు ముత్యంలా మెరిసిపోతున్న అనన్య.. చందమామ కూడా నీ ముందు తక్కువే సఖి!
ప్రస్తుతం ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను అలరించడానికి "GQ ఇండియా బెస్ట్ డ్రెస్డ్ 2025" ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 5 Sept 2025 3:14 PM ISTప్రస్తుతం ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను అలరించడానికి "GQ ఇండియా బెస్ట్ డ్రెస్డ్ 2025" ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్స్ తమ అద్భుతమైన ఆకర్షణతో అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా వినూత్నమైన.. సరికొత్త హంగులతో రూపొందించిన ఈ దుస్తులు అటు చూసే ఆడియన్స్ కు కన్నుల విందుగా అనిపించడమే కాకుండా.. వీటిని ధరించిన సెలబ్రిటీలను దేవకన్యలుగా మార్చేశాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ముత్యాలతో చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక డ్రెస్ ను ప్రముఖ హీరోయిన్ అనన్య పాండే ధరించింది. ఈ డ్రెస్ ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పవచ్చు.
వన్ పీస్ డ్రెస్ గా డిజైన్ చేసిన ఈ ముత్యాల డ్రెస్ థైస్ కనిపించేలా పైకి చాలా అందంగా తయారు చేశారు.. సుమారుగా కొన్ని వేల ముత్యాలను ఈ డ్రెస్ డిజైనింగ్ కోసం ఉపయోగించినట్లు తెలుస్తోంది. అనన్య పాండే ధరించిన ఈ డ్రెస్ చూసి కుర్రాలలో కవిత్వం పుట్టుకొస్తోంది. ముత్యములా కనిపిస్తున్న నిన్ను చూసి చంద్రుడు కూడా సిగ్గుపడతాడేమో సఖి అంటూ ఎవరికి వారు కవిత్వాలు పలికేస్తున్నారు. ఇంకొంతమంది అప్పుడే ముత్యపు దిబ్బ నుండి బయటకు వచ్చావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే అనన్య పాండే ధరించిన ఈ డ్రెస్ ఆమె అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా ఇలాంటి ఫ్యాషన్ దుస్తులు కూడా ఉంటాయా అని అభిమానుల సైతం నోరెళ్లపెట్టేలా చేస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం అనన్యకు సంబంధించిన ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనన్య పాండే కెరియర్ విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనన్య పాండే.'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. 1998 అక్టోబర్ 30న ముంబై మహారాష్ట్రలో జన్మించింది. ఈ చిత్రం తర్వాత 'పతి పత్ని ఔర్ ఓ' అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత రెండు మూడు చిత్రాలలో నటించిన అనన్య పాండే.. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' అనే చిత్రంలో నటించింది. అటు విజయ్ దేవరకొండకు ఇది తొలి పాన్ ఇండియా చిత్రం కావడం గమనార్హం . ఇందులో అనన్య అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగులో మళ్లీ ఈమె అవకాశాలు అందుకోలేదు. దాంతో బాలీవుడ్ కే పరిమితమైన ఈమె.. అక్కడే పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కేసరి చాప్టర్ 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు మరో రెండు చిత్రాలతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా మరొకవైపు టెలివిజన్ సిరీస్ లలో కూడా నటించిన ఈమె మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది.
