Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: కోట్లు కొల్లగొడుతున్న తండ్రీకూతుళ్లు

ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా ప్రపంచంలో తమకున్న విపరీతమైన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తున్నారు.

By:  Sivaji Kontham   |   8 July 2026 10:00 AM IST
ట్రెండీ టాక్: కోట్లు కొల్లగొడుతున్న తండ్రీకూతుళ్లు
X

ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా ప్రపంచంలో తమకున్న విపరీతమైన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తున్నారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ వేదిక‌ల‌పై అత్యధిక డిమాండ్ ఉన్న యువ కథానాయికలలో అనన్య ఒకరు. సినిమాల్లో నటిస్తూనే ఇటు ఇన్‌స్టాగ్రామ్‌లో నింజా కిచెన్, డ్రూల్స్ ఇండియా, ఆండ్రాయిడ్, పియాజెట్ వంటి టాప్ అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ కోట్లు కొల్లగొడుతోంది.

సోషల్ మీడియా వేదికగా అనన్యా పాండే సంపాదన గ్రాఫ్ భారీ స్థాయిలో ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక్కో బ్రాండ్ పోస్ట్ లేదా రీల్ షేర్ చేయడానికి ఆమె సుమారు 5 లక్షల నుండి 10 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసే ఒక ప్రమోషనల్ పోస్ట్‌కు 2 లక్షల నుండి 4 లక్షల వరకు వసూలు చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక ప్రముఖ బ్రాండ్‌తో ఏడాది పొడవునా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం ఒప్పందం కుదుర్చుకుంటే.. ఆ డిజిటల్ కాంట్రాక్ట్ విలువ ఏకంగా 50 లక్షల నుండి 1 కోటి వరకు పలుకుతోంది.

ఇక ఇటీవల అనన్యా పాండే తన తండ్రి, సీనియర్ నటుడు చంకీ పాండేతో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటూ సరికొత్త యాడ్ ట్రెండ్‌కు తెరతీశారు. వీరిద్దరి కలయికలో వస్తున్న కమర్షియల్ ప్రకటనలకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రేజీ తండ్రీకూతుళ్ల కాంబినేషన్‌ను వాడుకోవడానికి ప్రముఖ బ్రాండ్స్ పోటీ పడుతుండటంతో.. వీరిద్దరి ఉమ్మడి ప్రకటనల ప్యాకేజీ (వీడియో షూట్ - ప్రమోషన్స్ కలిపి) దాదాపు 1.5 కోట్ల నుండి 2 కోట్ల వరకు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వెండితెర విషయానికి వస్తే బాలీవుడ్‌లో అనన్యా పాండే స్టార్‌డ‌మ్ రోజురోజుకూ పెరుగుతోంది. హిందీ చిత్రాలలో నటించడానికి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది. బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ చిత్ర పరిశ్రమలో కూడా అన‌న్య‌కు మంచి గుర్తింపు లభించింది. ఇక్కడి ప్రాంతీయ భాషల్లో ఉన్న క్రేజ్ - పాన్-ఇండియా అప్పీల్ కారణంగా సౌత్ సినిమాల కోసం అనన్య ఏకంగా 2 కోట్ల నుండి 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.

మరోవైపు అన‌న్య తండ్రి చంకీ పాండే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సరికొత్త ఇన్నింగ్స్‌తో బిజీగా గడుపుతున్నారు. హిందీతో పాటు సౌత్ చిత్రాలలో సహాయ నటుడిగా లేదా పవర్‌ఫుల్ విలన్ పాత్రల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. అత‌డు సాహో చిత్రంలోను న‌టించిన విషయం తెలిసిన‌దే. చంకీ పాండే ఒక్కో సినిమాకు తన పాత్ర నిడివి, కాల్‌షీట్ల ఆధారంగా 50 లక్షల నుండి 1 కోటి వరకు పారితోషికం వసూలు చేస్తున్నారు. మొత్తానికి పాండే కుటుంబం అటు వెండితెరపై నటులుగా రాణిస్తూనే.. ఇటు డిజిటల్ స్క్రీన్‌పై ఉమ్మడిగా బ్రాండ్ వాల్యూతో దూసుకుపోతోంది. తండ్రి కూతుళ్లు ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ కోట్లు కొల్ల‌గొడుతున్నారు!