Begin typing your search above and press return to search.

గ్లోబల్ ఫేస్ ఆఫ్ బ్యూటీగా అనన్య పాండే.. గ్లామర్ తోనే పిచ్చెక్కిస్తూ ఫోటోలకు ఫోజులు!

చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది సెలబ్రిటీ కిడ్స్ తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని అడుగు పెడతారు.

By:  Madhu Reddy   |   28 Oct 2026 12:10 PM IST
గ్లోబల్ ఫేస్ ఆఫ్ బ్యూటీగా అనన్య పాండే.. గ్లామర్ తోనే పిచ్చెక్కిస్తూ ఫోటోలకు ఫోజులు!
X

చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది సెలబ్రిటీ కిడ్స్ తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని అడుగు పెడతారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం సులభమే అయినా ఆ స్థానాన్ని పదిలం చేసుకోవాలి అంటే తమ టాలెంటును నిరూపించుకోవాల్సి ఉంటుంది. అద్భుతమైన నటన, కథల ఎంపిక విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తే తప్ప ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం కష్టం. అయితే మరికొంతమంది కష్టాన్ని ఎదుర్కొంటూ.. తమ టాలెంట్ ని ఉపయోగించుకుంటూ.. అద్భుతమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తమకంటూ ఒక స్థానాన్ని పరిచయం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సెలబ్రిటీ కిడ్ అనన్య పాండే కూడా ఒకరు.




నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. తన అద్భుతమైన నటనతో ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో ఫిలింఫేర్ అవార్డు అందుకున్న అనన్య.. ఫోర్బ్స్ ఆసియాలో అండర్ 30 జాబితాలో స్థానం కూడా సంపాదించుకుంది. ముఖ్యంగా అక్కడ హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్న ఈమె.. గత ఏడాది కేసరి చాప్టర్ 2 అనే కోర్టు రూమ్ డ్రామాలో లాయర్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.




అలాంటి అనన్య పాండే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తూ గ్లామర్ తో కుర్రకారు డ్రీమ్ గర్ల్ గా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాంటి అనన్య పాండే తాజాగా గ్లోబల్ ఫేస్ ఆఫ్ బ్యూటీ అవార్డు అందుకొని మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి.




ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ చేనెల్ రూపొందించిన పాల్ 2026 కలెక్షన్ నుండి ఈ క్లాసిక్ బ్లాక్ మినీ డ్రెస్ ను ఎంపిక చేసుకుంది. ఈ డ్రెస్ కి ముందు భాగం హై బటేవు నెక్, పొడవాటి చేతులతో చాలా సింపుల్ గా ఉంటుంది . కానీ వెనుక వైపు మాత్రం డీప్ బ్యాక్ లెస్ డిజైన్ అద్భుతమైన లుక్కుని ఇస్తుంది. డ్రెస్ వెనుక భాగంలో ఒక సన్నని బంగారు రంగు బాడీ చైను, మెడ వద్ద విలక్షణమైన పక్షి ఈకల తో డిజైన్ చేసిన ప్రత్యేక అలంకరణ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అలా మొత్తానికి అయితే ఈ లేటెస్ట్ బ్లాక్ మనీ అవుట్ ఫిట్ తో గ్లామర్ వలకబోస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్ద గుమ్మ.




ఇక ఈ డ్రెస్ కి సరిపోయేలా బంగారు రంగు చెవి రింగులు ధరించిన ఈమె.. జుట్టును చక్కగా పైకి ముడివేసి తన మేకోవర్ ను ఫుల్ ఫీల్ చేసుకుంది. ఇక ముంబైలో జరిగిన ఎల్లే ఇండియా బ్యూటీ అవార్డ్స్ వేడుక కోసం ఈమె ధరించిన ఈ లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ అవార్డు వేడుకల్లోనే ఆమె గ్లోబల్ ఫేస్ ఆఫ్ బ్యూటీ అవార్డు సొంతం చేసుకుంది.