Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ సినిమా రిలీజైందా.. ట్రోలింగే

అనన్య సినీ రంగంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుండగా.. ఇప్పటిదాకా రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ.. నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అనన్య.

By:  Garuda Media   |   25 May 2026 1:44 PM IST
ఆ హీరోయిన్ సినిమా రిలీజైందా.. ట్రోలింగే
X

బాలీవుడ్లో పెద్దగా టాలెంట్ లేకపోయినా కరణ్ జోహార్ లాంటి వాళ్ల అండతో అవకాశాలు అందుకుంటూ ఉంటారంటూ నెపో కిడ్స్ కొందరి మీద విమర్శలు వస్తుంటాయి. ఈ జాబితాలో చాలా ముంది ప్రస్తావించే వాళ్లలో అనన్య పాండే పేరు ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ నటుడు చుంకీ పాండే తనయురాలైన అనన్య.. 2019లో కరణ్ జోహార్ మూవీ ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

అనన్య సినీ రంగంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుండగా.. ఇప్పటిదాకా రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ.. నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అనన్య. అందాలు ఆరబోయడం తప్పితే ఆమెలో ఎలాంటి టాలెంటూ లేదని తన సినిమా రిలీజైనపుడల్లా నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. తెలుగులో ఆమె విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘లైగర్’ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఆ సినిమాలో తన పాత్ర, నటన ఎంత ఇరిటేటింగ్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా రిలీజ్ టైంలోనూ ఆమె మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

తాజాగా అనన్య నుంచి ‘చాంద్ మేరే దిల్’ అనే సినిమా వచ్చింది. ‘కిల్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన లక్ష్య ఇందులో హీరోగా నటించాడు. అనన్య సినిమాల్లో చాలా వరకు ప్రొడ్యూస్ చేసిన కరణ్ జోహారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించాడు. ఈ సినిమాకు కొంచెం పాజిటివ్ టాకే వచ్చినా.. లక్ష్య పెర్ఫామెన్సు‌ను అందరూ మెచ్చుకున్నా.. అనన్య మీద మాత్రం విమర్శలు తప్పట్లేదు. ముఖ్యంగా ఇందులో ఆమె భరత నాట్యం చేసే ఒక సన్నివేశం మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది.

ఒక రోబో క్లాసికల్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో.. అనన్య అలా చేసిందంటూ తన మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భరత నాట్యాన్ని ఖూనీ చేసిందని ఆమె మీద మండిపడుతున్నారు క్లాసికల్ డ్యాన్స్ లవర్స్. మంచి సినిమా చేసినా సరే.. తన పెర్ఫామెన్స్ మీద విమర్శలు వచ్చాయంటే ఆ హీరోయిన్ పరిస్థితేంటో చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో అనన్య కథానాయిక కాకపోతే పెద్ద హిట్టయ్యేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.