అమాయకపు చూపులతో యువతను మాయ చేస్తున్న అనన్య!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల.
By: Madhu Reddy | 14 Feb 2026 3:02 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే గ్లామర్ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేయడం అమ్మడికి అలవాటుగా మారిపోయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ బ్యూటీ షార్ట్ స్కర్ట్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది . కొంటె చూపులతో కసిగా కవ్విస్తూ యువత గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
తాజాగా యాష్ కలర్ మినీ స్కర్ట్ ధరించిన ఈమె అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి. వాలెంటైన్స్ డే వేళా యువతకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనన్య నాగళ్ళ షేర్ చేసిన ఈ మినీ స్కర్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె అభిమానులు. ఈ ఫోటోలకు తెగ లైక్ షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన ఈ తెలుగమ్మాయి.. ఒక వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చింది. చదువు కోసం హైదరాబాద్ వెళ్ళిన ఈ ఇబ్రహీంపట్నంలోనే రాజా మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసి ఇండస్ట్రీలోకి రాకముందే ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం కూడా చేసింది. 2019లో ప్రియదర్శితో కలిసి మల్లేశం సినిమాకి హీరోయిన్ గా ఎంపికైంది. మొదటి సినిమాతోనే అందరూ దృష్టిని ఆకట్టుకుంది. చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రాజు రాచకొండ రచించి , దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల పాత్రకు మంచి పేరు లభించింది. నిజానికి ఈమె పేరు అనూష నాగళ్ల అయితే ఈ చిత్రం ద్వారానే ఈమెకు అనన్య నాగళ్ళ అని పేరు మార్చారు. ఇక ఇందులో మల్లేశం భార్య పద్మా పాత్రలో ఒదిగిపోయింది. సహజమైన అమాయకత్వంతో నటనతోలోకి చొచ్చుకుపోయింది.
అలాంటి అనన్య నాగళ్ళ ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో వంటి చిత్రాలలో నటిగా నటించి.. ఊర్వశివో రాక్షసివో సినిమాలో దివ్య అనే పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. అన్వేషి, తంత్రం, డార్లింగ్ వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన అనన్య 2024 లో వచ్చిన డార్లింగ్ సినిమాలో డాక్టర్ నందిని పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇక చివరిగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో నటించింది అనన్య నాగళ్ళ. తెలుగు భాషా కామెడీ థ్రిల్లర్గా విడుదలైన ఈ చిత్రం ద్వారా రచయిత మోహన్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. శ్రీ గణపతి సినిమాస్ పతాకం పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ టైటిల్ పాత్ర పోషించారు. ప్రస్తుతం అవకాశాలు అందుకునే పనిలో పడ్డ అనన్య అందులో భాగంగానే ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తోంది.
