ఏళ్లకే `మ్యాడ్` బ్యూటీ రాజకీయం ఇంట్రెస్టింగ్!
కేరళ కుట్టి అనంతిక సనీల్ కుమార్ సుపరిచితమే. `రాజమండ్రి రోజ్ మిల్క్` తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు `మ్యాడ్` తో వెలుగులోకి వచ్చింది
By: Srikanth Kontham | 8 Sept 2025 4:00 AM ISTకేరళ కుట్టి అనంతిక సనీల్ కుమార్ సుపరిచితమే. `రాజమండ్రి రోజ్ మిల్క్` తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు `మ్యాడ్` తో వెలుగులోకి వచ్చింది. ఆ ఒక్క సక్సెస్ అమ్మడికి యువతలో ఫాలోయింగ్ రెట్టింపు చేసింది. అందం, అభినయంతో పాటు ప్రతిభతో అనంతిక నటిగా బిజీ అయింది. ఈ మూడింటిని మించి మార్షల్ ఆర్స్ట్, కలిరయ పట్టు లాంటి విద్యలోనూ ఆరితేరిన బ్యూటీ. మంచి డాన్సర్ కూడా. అద నంగా ఈ మూడు క్వాలిఫికేషన్స్ అమ్మడికి మరింత గుర్తింపును తీసుకొచ్చాయి. అటుపై తమిళ్ లో `రైడ్` సినిమాతో లాంచ్ అయింది.
మూడేళ్లైనా ఇంకా ఖాళీగానే:
అనంతరం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `లాల్ సలామ్` లోనూ భాగమైంది. ఇటీవల విడుదలై `8 వ సంతాలు` అనే మరో తెలుగు సినిమాలోనూ నటించింది. అయితే ఇవేవి సొగసరి ట్యాలెంట్ కి తగ్గ అవకా శాలు కాదు. కెరీర్ ప్రారంభమై మూడేళ్లు గడిచినా ఇంకా నటిగా బిజీ కాలేదు. టైర్ -2, టైర్ 3 హీరోలకు అమ్మ డు మంచి ఆప్షన్. కానీ అనంతిక మాత్రం ఆ రేసులో కనిపించలేదు. అనంతిక సమకాలీకులంతా బిజీగా ఉన్నా? ఈ ట్యాలెంటెడ్ బ్యూటీకి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
నటిగా గర్విస్తోన్న బ్యూటీ
ఈ విషయంలో తాను కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. `8వసంతాలు` సినిమాకు ఎలాంటి ఆడీషన్ లేకుండా కేవలం తన ప్రతిభను చూసే దర్శకుడు ఎంపిక చేసినట్లు సంతోషం వ్యక్తం చేసింది. నటిగా కూడా ఈ సినిమాతో తానెంతో గర్వపడుతున్నట్లు తెలిపింది. ఆ సంగతి పక్కన బెడితే అనంతిక రాజకీయాలపై కూడా ఆసక్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్ లో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానంది. ప్రజలకు సేవ చేయాలన్నది తన అభిమతంగా పేర్కొంది. చిన్ననాటి నుంచి సినిమాలతో పాటు రాజకీయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటాయంది.
చిన్న వయసులోనే రాజకీయం:
నిత్యం రాష్ట్ర రాజకీయాల గురించి ఇంట్లో డిస్కషన్ ఉంటుందంది. రాజకీయాల కోసమే `లా` కూడా చదువుతున్నట్లు పేర్కోంది. చట్టాల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తెరంగేట్రం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. మొత్తానికి అనంతికలో ఈ యాంగిల్ కూడా ఇంట్రెస్టింగ్. సాధారణంగా 30 ఏళ్ల తర్వత ఏ నటైనా రాజకీయాల గురించి ఆలోచిస్తారు. కానీ అనంతిక 20 ఏళ్లకే రాజకీయాలపై ఆసక్తి చూపించడం విశేషం. ప్రస్తుతం అనంతిక చేతిలో కొత్త సినిమాలేవి లేవు. అవకాశాలు కోసం ప్రయత్నిస్తుంది. మరి ఏడాది ముగిసేలోపు కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తుందా? అన్నది చూడాలి.
