వంగా మార్క్ సెలెక్షన్: 'రోమాంచకం' నటి ఆ ఇంటెన్సిటీని తెస్తుందా?
'రోమాంచకం' చిత్రానికంటే ముందే అనంతిక తన కెరీర్ జర్నీలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులకు దగ్గరైంది.
By: Sivaji Kontham | 25 July 2026 6:00 AM ISTతెలుగు చిత్రసీమలో తనదైన పవర్ ఫుల్ పెర్ఫామెన్స్- ఇంటెన్సిటీతో, వైవిధ్యమైన కథనాలతో ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్న లేటెస్ట్ మూవీ `రోమాంచకం`. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సింగిల్ `రాధా రమణ` పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న అనంతిక సనిల్‌కుమార్ తన అందచందాలు, నటనాభినయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కథానాయికల పాత్రలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. `అర్జున్ రెడ్డి`లో షాలిని పాండే, `కబీర్ సింగ్`లో కియారా అద్వానీ... అలాగే `యానిమల్` చిత్రంలో రష్మిక మందన్న పోషించిన పాత్రలు కేవలం నటనకే పరిమితం కాకుండా తమ అద్బుత అభినయంలోనే ఎంతో ఇంటెన్సిటీని.. బలమైన ఎమోషన్‌ను పండించారు. ఆ సినిమాలలో లవ్ సీన్లు ఎంత వర్కవుట్ అయ్యాయో.. ఎమోషనల్ డ్రామా కూడా అంతే స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేయడానికి నాయికల ప్రదర్శన కూడా ఒక కారణం. ఇప్పుడు సందీప్ సెలెక్ట్ చేసిన అనంతిక కూడా అదే రేంజ్‌లో నటనను ప్రదర్శించి..ఆ రేంజ్ ఇంటెన్సిటీని స్క్రీన్ పైకి తీసుకురావాల్సి ఉంది.
`రోమాంచకం` చిత్రానికంటే ముందే అనంతిక తన కెరీర్ జర్నీలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులకు దగ్గరైంది. `మ్యాడ్`వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాటు `లవ్ రెడ్డి` వంటి సినిమాల్లో నటించి తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది. స్వతహాగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ చిన్నగా కెరీర్‌ను నిర్మించుకుంటున్న ఈ మలయాళ బ్యూటీకి `రోమాంచకం` ఒక బిగ్గెస్ట్ మైలురాయిగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ సినిమాలో అనంతిక కేవలం గ్లామర్‌కే లేదా లవ్ సీన్లకే పరిమితం కాకుండా... ఎమోషనల్ పాయింట్‌లోనూ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తే అది మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. సందీప్ వంగా బ్రాండ్ ఇమేజ్ ఈ సినిమాపై ఉండటంతో... కథానాయిక పాత్రపై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనంతిక తన నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేయగలిగితే... ఈ మూవీ ద్వారా తనకు పరిశ్రమలో పూర్తి స్థాయిలో బిజీ హీరోయిన్‌గా గుర్తింపు రావడం ఖాయం.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉప్పెనలా దూసుకొస్తున్న నేటితరం యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్లకి అనంతిక గట్టి పోటీనిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, మమితా బైజు వంటి క్రేజీ భామల సరసన తనదైన నటన.. ప్రత్యేకమైన క్యూట్‌నెస్‌తో అనంతిక కూడా రేసులోకి రాబోతోంది. సెప్టెంబర్ 3న `రోమాంచకం` థియేటర్లలోకి వచ్చాక సందీప్ వంగా విజన్ అండ్ సెలెక్షన్ అవంతిక కెరీర్‌ను ఎంతటి ఎత్తుకు తీసుకెళ్తుందో చూడాలి.
