Begin typing your search above and press return to search.

గరివిడి లక్ష్మికి ఆ మూడూ క్లిక్కయితే చాలు!

నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, ఎవరికీ తెలియని వ్యక్తుల జీవితాల ఆధారంగా సినిమాలు ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.

By:  M Prashanth   |   11 Oct 2026 6:06 PM IST
గరివిడి లక్ష్మికి ఆ మూడూ క్లిక్కయితే చాలు!
X

నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, ఎవరికీ తెలియని వ్యక్తుల జీవితాల ఆధారంగా సినిమాలు ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నమే గరివిడి లక్ష్మి కూడా. ఉత్తరాంధ్రలో తన ఫోక్ సాంగ్స్ తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మి లైఫ్ స్టోరీతో ఆ సినిమా రూపొందింది. ఆనంది లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ హైప్ పెంచుతుండగా, సినిమా వర్కౌట్ కావాలంటే మూడు విషయాలు బాగా కుదరాలని టాక్ వినిపిస్తోంది.

నిజానికి గరివిడి లక్ష్మి అంటే జానపద పాటలు గుర్తొచ్చే వాళ్లు చాలామందే ఉన్నారు. ఒకప్పుడు ఆమె పాటలు పల్లెల్లో మార్మోగాయి. బుర్రకథలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే ఆమె జీవితంలో ఎదురైన కష్టాలు, మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి చేసిన పోరాటం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాలను మూవీ రూపంలో చూపించబోతున్నారు. దీంతో ఆ సినిమా కేవలం ఓ ఆర్టిస్ట్ లైఫ్ స్టోరీగానే కాకుండా, ఓ మహిళ తన టాలెంట్ తో ఎలా ఎదిగారని కథగా కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

అయితే స్టోరీ ముందు ప్రేక్షకుల మనసుకు చేరాలి. గరివిడి లక్ష్మి లైఫ్ లో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఆర్టిస్ట్ గా ఆమె ఎదిగిన స్టోరీ, లైఫ్ లో ఎదురైన కష్టాలు, వాటిని దాటి ముందుకు సాగిన విధానం ఆడియన్స్ ను ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. అవన్నీ స్క్రీన్ పై నేచురల్ గా కనిపించాలి. ఆమె సమస్యలను కళ్లముందు జరుగుతున్నట్లుగా ఆడియన్స్ భావించగలిగితే సినిమాతో స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడుతుంది. రెండోది.. పాటలు ఆకట్టుకోవాలి.

ఫోక్ ఆర్టిస్ట్ లైఫ్ స్టోరీలో మ్యూజిక్ కు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అందుకే ఆ సినిమాకు పాటలు చాలా ముఖ్యం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. పాత పాటలను కూడా యువత ఎంజాయ్ చేస్తోంది. ఆ సమయంలో గరివిడి లక్ష్మి పాటలను కొత్త జెనరేషన్ కు పరిచయం చేయగలిగితే సినిమాకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర పల్లెలు, అక్కడి సంస్కృతి, ప్రజల జీవన విధానం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. మూడోది.. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగాలి.

నిజ జీవిత కథలు కాబట్టి ప్రేక్షకులకు అన్నీ ముందే తెలిసిపోతే ఇంట్రెస్ట్ కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే కథను ఎక్కడా బోర్ కొట్టకుండా చెప్పడం ముఖ్యం. గరివిడి లక్ష్మి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఇంట్రెస్టింగ్ గా చూపించాలి. ఆమె ఒక్కసారిగా ఎవరికీ కనిపించకుండా పోవడం వెనుక ఉన్న విషయం కథలో ఇంట్రెస్ట్ పెంచే ఎలిమెంట్ గా మారవచ్చు.

ఇలాంటి విషయాలను స్ట్రాంగ్ గా చూపిస్తే యూత్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సినిమాలకు భారీగా ప్రేక్షకులు మొదటి రోజే థియేటర్లకు వస్తారని చెప్పలేం. మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే గరివిడి లక్ష్మి లైఫ్ లోని ఎమోషన్స్, సాంగ్స్, స్టోరీ స్ట్రాంగ్ గా అనిపించాలి. ఇవి ప్రేక్షకులకు నచ్చితే మంచి రిజల్ట్ అందుకునే అవకాశం ఉంది.