తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిపై విజయ్ సెన్సేషన్ కామెంట్!
ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
By: Madhu Reddy | 2 March 2026 7:59 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్న జంటలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తారు. ప్రేమతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంట..ఇప్పుడు వివాహంతో నేషనల్ వైడ్ గుర్తింపు అందుకున్నారు.. 2018 లో పరుశురాం దర్శకత్వంలో వచ్చిన 'గీతా గోవిందం' సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. ఎనిమిదేళ్ల తర్వాత ఉదయపూర్ లోని హై ప్రొఫైల్ హోటల్లో కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు , బంధువుల సమక్షంలో ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇద్దరూ తమ అధికారిక ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా .. షేర్ చేసిన 12 గంటల్లోనే రెండున్నర కోటికి పైగా లైక్స్ సంపాదించి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా పెళ్లి ఫోటోలతో ఈ రేంజ్ క్రేజ్ అందుకున్న జంట కూడా బహుశా ఇదేనేమో అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ.. తన సొంత మూలాలను ఆయన మర్చిపోలేదనే చెప్పాలి.. అందులో భాగంగానే తెలంగాణ నాగూర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలోని.. తన స్వగ్రామమైన తుమ్మన్ పేటకి భార్య రష్మిక మందన్న తీసుకొని రావడం ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా అక్కడ సొంతంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్ గృహప్రవేశంతో పాటు భార్యతో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా పూర్తి చేశారు.
అనంతరం తన గ్రామ ప్రజలందరికీ విందు ఏర్పాటు చేశారు. 2000 మందికి పైగా గ్రామ ప్రజలు, బంధువులు, అతిథులు, సన్నిహితులు ఈ ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇకపోతే గ్రామ ప్రజల కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఊహించని విధంగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లి గురించి మాట్లాడి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఇక నుండి నా భార్య రష్మిక , నా తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి తరచూ గ్రామానికి వస్తాము. నా తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లి కూడా గ్రామంలోనే అందరి సమక్షంలో చేస్తాము" అంటూ చెప్పి అభిమానులను, గ్రామ ప్రజలను సంతోషపరిచారు విజయ్ దేవరకొండ . మొత్తానికైతే తన తమ్ముడి పెళ్లి తన సొంత గ్రామంలోనే చేయాలని అనుకున్నట్లు, అందుకు తగ్గట్టుగానే ఆ విషయాన్ని అందరికీ తెలియజేసి సర్ప్రైజ్ చేశారు. మొత్తానికైతే మంచి అమ్మాయి దొరికినా లేకపోతే ఎవరినైనా ఆనంద్ ఇష్టపడినా సరే వారి పెళ్లి మాత్రం తుమ్మన్ పేటలోనే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.
ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2019లో వచ్చిన 'దొరసాని' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత పుష్పక విమానం, హైవే వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్న ఈయన బేబీ సినిమాతో తన నటనా విశ్వరూపాన్ని చూపించి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. చివరిగా గంగం గణేశా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
