Begin typing your search above and press return to search.

ఈ కుర్రోడు మస్తు కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు రా..

ఆనంద్ ఈ విషయం చెప్పగానే సాయి కూడా వెంటనే స్పందించారు. కొద్ది రోజుల క్రితం తాను దేవరకొండల ఇంటికి వెళ్లినప్పుడు గోవర్ధన్ రావు ఇదే విషయం తనతో నేరుగా చెప్పారని తెలిపారు.

By:  M Prashanth   |   1 Sept 2026 9:46 AM IST
ఈ కుర్రోడు మస్తు కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు రా..
X

‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు చేసిన ఒక కామెంట్ గురించి ఆనంద్ దేవరకొండ రివిల్ చేశారు. ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన స్పెషల్ చిట్‌చాట్‌ను సాయి హోస్ట్ చేశారు. మాట్లాడుతున్న సమయంలో సాయి ఇంటర్వ్యూల ప్రస్తావన రావడంతో ఆనంద్ తన డాడీ అప్పట్లో చెప్పిన మాటను గుర్తు చేసుకున్నారు.

ఆ కామెంట్ వినగానే సాయి కూడా తనకు ఇటీవల ఎదురైన అదే విషయాన్ని అక్కడ షేర్ చేసుకున్నాడు. ఆనంద్ మాట్లాడుతూ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా టైమ్‌లో సాయి మార్తాండ్ తమకు పెద్దగా పరిచయం లేదు. కానీ ఆ సినిమా ప్రమోషన్స్‌లో అతను ఇచ్చిన ఇంటర్వ్యూలను గోవర్ధన్ రావు చూశారట. “ఈ కుర్రోడు మస్తు కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు రా” అని అప్పుడే తనతో అన్నారని ఆనంద్ చెప్పారు.

ఆనంద్ ఈ విషయం చెప్పగానే సాయి కూడా వెంటనే స్పందించారు. కొద్ది రోజుల క్రితం తాను దేవరకొండల ఇంటికి వెళ్లినప్పుడు గోవర్ధన్ రావు ఇదే విషయం తనతో నేరుగా చెప్పారని తెలిపారు. ‘లిటిల్ హార్ట్స్’ టైమ్‌లో తన ఇంటర్వ్యూలు చూసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారని సాయి చెప్పారు. దీంతో ఆనంద్ చెప్పిన పాత కామెంట్‌కు సాయి దగ్గర నుంచి కూడా అదే సందర్భంలో కన్ఫర్మేషన్ వచ్చింది.

అసలు సాయి దేవరకొండల ఇంటికి ఎందుకు వెళ్లారనే విషయం కూడా అక్కడే బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండతో తాను ఒక యాడ్ షూట్ చేశానని సాయి వెల్లడించారు. ఆ యాడ్‌కు సంబంధించిన డిస్కషన్స్ కోసమే ఇటీవల వాళ్ల ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. ఆ సమయంలోనే గోవర్ధన్ రావుతో మాట్లాడే అవకాశం వచ్చిందని, అప్పుడే తన పాత ఇంటర్వ్యూల ప్రస్తావన ఆయన తీసుకొచ్చారని వివరించారు.

ఈ చిట్‌చాట్ మొత్తం ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగింది. ఆనంద్ దేవరకొండకు జోడీగా వైష్ణవి చైతన్య నటిస్తున్న ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ ఈ ఇంటర్వ్యూను హోస్ట్ చేయడంతో సినిమా విషయాలతో పాటు ఇలాంటి వ్యక్తిగతంగా జరిగిన చిన్న మూమెంట్స్ కూడా మాటల్లోకి వచ్చాయి. ఇక ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి కలిసి నటిస్తున్న సినిమా ఇదే. రిలీజ్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ చిట్‌చాట్స్ చేస్తోంది.