రష్మిక వదిన గురించి మరిది ఆనంద్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్‌లో జరిగిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమా కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది ఒక సరదా కామెంట్.
By: Sravani Lakshmi Srungarapu | 30 April 2026 10:35 AM ISTహైదరాబాద్‌లో జరిగిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమా కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది ఒక సరదా కామెంట్. ఆనంద్ దేవరకొండ చేసిన రష్మిక వదిన అనే కామెంట్స్ ఈవెంట్‌కు స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. స్టేజ్‌పై మాట్లాడిన ఆనంద్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రష్మిక మందన్నాను తప్పకుండా పిలుస్తానని చెప్పడంతో పాటు, గతంలో వదిన వదిన అంటూ తనను ఎంతగా ఆటపట్టించారో గుర్తు చేసుకుని నవ్వులు పూయించాడు. ఈ ఒక్క కామెంట్‌తోనే సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అవుతూ, ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలకు దారితీసింది.
టీజర్ లాంచ్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన ఆనంద్ కు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. రష్మిక మీ ఇంటి కోడలిగా వచ్చాక మీ ఫ్యామిలీ లో వచ్చిన మార్పేంటి అని? దానికి ఆనంద్ చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. రష్మిక తమ ఇంటికి వచ్చిన తర్వాత ఒక కొత్త వెలుగు వచ్చిందని, ఆమెంతో పాజిటివ్ అని, ఎప్పుడూ పాజిటివ్ మూడ్ ను క్యారీ చేస్తుంటుందని, చాలా సపోర్టివ్ పర్సన్ అని చెప్పాడు. ఇక రష్మిక- ఆనంద్ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే.
విజయ్ ను పెళ్లి చేసుకోకముందు కూడా కూడా రష్మిక ఆనంద్ సినిమాల ఈవెంట్స్‌కు గెస్ట్‌గా హాజరై అతడికి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే ఆనంద్ ను సపోర్ట్ చేసిన రష్మిక ఇప్పుడు పెళ్లి తర్వాత మరింత సపోర్ట్ చేయడం ఖాయం. కాబట్టి ఆనంద్ అడగాలే కానీ తన ఎపిక్ మూవీ ఈవెంట్ కు రష్మిక రావడం పెద్ద విషయమేమీ కాదని స్పష్టమవుతోంది.
ఇక సినిమా గురించి చెప్పాలంటే, బేబీ సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి కలిసి ఈ సినిమాలో నటించారు. ఈసారి కూడా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే ప్రేమకథతో వస్తున్నామని ఆనంద్ చెప్పడం, సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. కాలేజ్ డేస్ మెమొరీస్, ఫస్ట్ లవ్, ఎమోషన్స్ మేళవింపుతో ఈ కథ ఆడియన్స్ కు దగ్గరవుతుందని టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది.
రీసెంట్ గా రిలీజైన ఎపిక్ టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోగా, టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాత్రం ఆనంద్, తన వదిన రష్మిక గురించి చేసిన కామెంట్సే ఎక్కువ హైలైట్ అవడం విశేషం. స్టార్స్ మధ్య ఉన్న పర్సనల్ బాండింగ్స్ ఇలా ఓపెన్ గా బయటకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఈ చిన్న సరదా కామెంట్స్ కూడా పెద్ద టాపిక్ గా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
