Begin typing your search above and press return to search.

ఎపిక్ రొమాంటిక్ సీన్స్.. ఆనంద్ దేవరకొండ పర్ఫెక్ట్ క్లారిటీ

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్.

By:  M Prashanth   |   1 Sept 2026 5:00 AM IST
ఎపిక్ రొమాంటిక్ సీన్స్.. ఆనంద్ దేవరకొండ పర్ఫెక్ట్ క్లారిటీ
X

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ జంట మరోసారి మ్యాజిక్ చేయడానికి వస్తున్నారు. 90స్ వెబ్ సిరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను గెలుచుకున్న ఆదిత్య హాసన్ ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ పెంచుతున్నారు. లేటెస్ట్ గా లిటిల్ హార్ట్స్ చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ తో జరిగిన ఒక ప్రత్యేకమైన చిట్ చాట్ లో ఎపిక్ టీమ్ పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సాయి మార్తాండ్ అడిగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు హీరో ఆనంద్ దేవరకొండ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి మీకు ఏమైనా డౌట్ వచ్చిందా అని సాయి మార్తాండ్ అడగ్గా ఆనంద్ దేవరకొండ చాలా క్లారిటీగా బదులిచ్చారు. ఆ సీన్స్ విషయంలో తనకు మొదటి నుంచి ఎలాంటి డౌట్ లేదని ఆయన ఓపెన్ గా చెప్పారు. కథ విన్నప్పుడే ఆ సన్నివేశాలు స్టోరీకి చాలా ఇంపార్టెంట్ అనిపించాయని అందుకే నటించేటప్పుడు అవి చాలా నేచురల్ గా వచ్చాయని ఆనంద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఏదో కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందనో లేక ఇర్రెస్పాన్సిబుల్ గానో ఆ సీన్స్ మేము తీయలేదని ఆనంద్ తెలిపారు. ఒక స్లీజీ వేలో రొమాన్స్ ను చూపించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సినిమా స్టోరీకి ఆ ఇంటిమసీ చాలా అవసరం కాబట్టే ఆ మేరకు మాత్రమే చాలా బాధ్యతగా చిత్రీకరించామని చెప్పారు. క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండింగ్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ సీన్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన గుర్తు చేశారు.

ఈ సినిమాలో ఒక లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతున్నామని ఆనంద్ దేవరకొండ రివీల్ చేశారు. ఒక అబ్బాయి అమ్మాయిని కలవడం వాళ్లు కలిసి ఒకేచోట ఉండటం లాంటివి ఇందులో చాలా రియలిస్టిక్ గా చూపిస్తున్నట్లు తెలిపారు. అలా కలిసి ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి గురించి అబ్బాయి కొత్త విషయాలు తెలుసుకునే ప్రాసెస్ లో ప్రేమ ఇంటిమసీ రావడం చాలా సహజమని ఆయన వివరించారు.

ఓవరాల్ గా ఇదొక ఫార్వర్డ్ ఫిల్మ్ అయినా కూడా చాలా రెస్పాన్సిబుల్ గా తీసిన సినిమా అని ఆనంద్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ ఎపిక్ మూవీ కథలో హీరో పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. లండన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో కుటుంబ బాధ్యతలు చదువుతో పాటు ఒక క్యూట్ ప్రేమకథ కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉండబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.