ఆ సీన్స్ పేరెంట్స్ కు కొంచెం కష్టమే.. 90s డైరెక్టర్ ఆదిత్య
బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మరో చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'.
By: M Prashanth | 31 Aug 2026 10:48 PM ISTబేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మరో చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో 'నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపుని అందుకున్న ఆదిత్య హాసన్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. లేటెస్ట్ గా లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య హాసన్ ఈ సినిమాలోని రొమాన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.
ఆ ఇంటర్వ్యూలో సాయి, ఆదిత్య హాసన్ ను ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. నైంటీస్ వెబ్ సిరీస్ ను ఒక ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తీశారని ఇప్పుడు ఈ ఎపిక్ సినిమాలో రొమాన్స్ సీన్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారని అడిగారు. ఈ ప్రశ్నకు ఆదిత్య హాసన్ చాలా ఓపెన్ గా సమాధానం ఇచ్చారు. ఈ సినిమాలో కూడా కొన్ని రొమాన్స్ సీన్స్ ఉన్నాయని అవి కూడా చాలా నేచురల్ గా రియలిస్టిక్ గా ఉంటాయని చెప్పారు.
నేను నా లైఫ్ లో చాలా విషయాల గురించి ఓపెన్ గా ఉంటాను. అలాగే నా సినిమాల్లో కూడా రొమాన్స్ గురించి కూడా ఓకల్ గా ఉంటాను. ఆ విషయంలో నాకు ఎలాంటి భయం లేదా సిగ్గుపడే స్వభావం లేదు అని ఆదిత్య హాసన్ క్లారిటీ ఇచ్చారు. అయితే తన మొదటి ప్రాజెక్ట్ నైంటీస్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ ఎమోషన్ ను కూడా ఈ సినిమాలో బ్యాలెన్స్ చేయాలని ముందుగానే అనుకున్నట్లు ఆయన వివరించారు.
ఎపిక్ లో రొమాన్స్ ఉన్నా కూడా అది మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ కు వెళ్లకుండా ఒక బార్ పెట్టుకుని అక్కడ వరకు మాత్రమే తీశామని ఆదిత్య హాసన్ చెప్పారు. సినిమాలో ఒక దగ్గర మాత్రమే అలాంటి రొమాన్స్ సీన్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఆ కొద్ది నిమిషాల పాటు బహుశా ఫ్యామిలీస్ కు లేదా పేరెంట్స్ కు కొంచెం అన్ కంఫర్టబుల్ గా అనిపించవచ్చని ఆదిత్య హాసన్ నిజాయితీగా అంగీకరించారు.
కానీ ఆ చిన్న ఇబ్బందిని పక్కన పెడితే సినిమా ఎండ్ అయ్యేసరికి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఎంతో నమ్మకంగా చెప్పారు. ఆ చిన్న రొమాన్స్ సీన్స్ ఉన్నా ఆ ఎమోషన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని వివరణ ఇచ్చారు. నైంటీస్ లో చిన్నప్పటి రోహన్ పాత్ర జర్నీని పెద్దయ్యాక కొనసాగించే కథగా ఈ సినిమా రాబోతోంది.
ఈ సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపిస్తారు. అక్కడ చదువు కుటుంబ బాధ్యతలు అలాగే అతని లవ్ స్టోరీ ఇలా అన్నీ కలిపి ఒక మంచి కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాను ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రొమాంటిక్ స్టోరీ ఎలా ఉండబోతోందో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
